ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 02:51 PM
 

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది.  1945, అక్టోబర్ 1న జన్మించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం రామ్‌నాథ్ పేరు నిర్ణయించామని అమిత్ షా తెలిపారు. బీజేపీలో అత్యంత ఉన్నతస్థాయికి ఎదిగిన దళిత నేత రామ్‌నాథ్. ఎన్డీయే తరపున అన్నిపార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ తమ రాష్ట్రపతి అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. రామ్‌నాథ్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దళిత నేత. యూపీ నుంచి 12 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ దళిత మోర్చ జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని విపక్షాలకు ఫోన్ లో తెలిపామన్నారు. విపక్షాలు వాళ్ల పార్టీల్లో చర్చించుకొని మాతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అమిత్‌షా వెల్లడించారు.