కరెక్టుగా రైలు పట్టాల మీదకు రాగానే కారు ఆగడం, ఆ తర్వాత డోర్లు ఓపెన్ కాకపోవడం, ఇంతలోనే ట్రైన్ రావడం ఇదంతా ఏదో భారీ బడ్జెట్ తెలుగు సినిమాలో సీన్ అనుకుంటే పొరపాటే. ఏపీలోని కడపలో అలాంటి ఘటన జరిగింది. రైలు పట్టాల మీద ఆగిపోయిన కారును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు.కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై. కోడూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రాక్ పై కారు ఆగిపోయింది. ఆ సమయంలోనే భారతీ సిమెంట్స్ లో వాగిన్లను వదిలి వస్తున్న రైలింజన్ ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. రైలింజన్ ఢీకొట్టడంతో కారు కొంతమేర రైలు పట్టాల మీద దూసుకుపోయింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa