ఏకంగా 35 పాము పిల్లలతో ఓ విషసర్పం బాత్రూమ్‌లో కాపురం పెట్టేసింది. వాటిని చూడగానే ఆ ఇంటి యజమాని అవాక్కయ్యాడు. స్నానానికి వెళ్లిన ఆయనకు పాములు కనిపించడంతో బయటకు పరుగులు తీశాడు. వెంటనే పాములను పట్టుకొనే వ్యక్తికి కాల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కొయంబతూర్‌లో చోటుచేసుకుంది.కోవిలమేడు ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లగా పాము పిల్లలతో ఉన్న ఓ పెద్ద విష సర్పం కనిపించింది. వెంటనే అతడు మురళీ అనే స్నేక్ క్యాచర్‌కు ఫోన్ చేశాడు. ఆ పాము, దాని పిల్లలను పట్టుకోవడానికి మురళీ చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు పాముతోపాటు 35 పాము పిల్లలను పట్టుకున్న అతడు వాటిని సంచిలో వేసుకుని అనైకట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa