రద్దీ ప్రాంతంలో ఓ వ్యక్తి చిలకల్ని, పక్షుల్ని తన బుట్టలో వేసుకొచ్చి అమ్ముతున్నాడు. బుట్టలో ఉన్న పక్షులు గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి కారులో వచ్చి ఆ పక్షులు ఎంతకు ఇస్తావని బేరమాడాడు. అతను రేటు చెప్పాక ఒక్కొక్కటీ తీసి ఇవ్వు అన్నాడు. అ పక్షుల్ని అమ్మే వ్యక్తి కారులో ఉన్న వ్యక్తికి పక్షుల్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇచ్చిన పక్షుల్ని ఇచ్చినట్లుగానే కారులోని వ్యక్తి గాల్లోకి వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత ఇంకొన్ని పక్షుల్ని కూడా అలాగే వదిలేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది దీన్ని చూసి కారులో వచ్చిన వ్యక్తిని మెచ్చుకుంటున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa