గాజువాక సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 12:21 PM
 

ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ డి వెంకయ్య నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. ఏకకాలంలో విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలోని ఆయన నివాసాలలో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో సోదాలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో భాగంగా బంగారం, వెండి ఆభరణాలు, విలువైన భూ పత్రాలతో పాటు రూ. 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.