రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వాణీ....!

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 12:12 PM
 

ఎన్టీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడబోతోంది. ఎంతో మంది పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్ఠానం చివరకు ఆ పార్టీ కురువృద్ధుడు అద్వాణీ వైపే మొగ్గు చూసింది. ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్టు సమాచారం. కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. అనంతరం రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వాణీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, బీజేపీ కీలక నేతలంతా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.