నేడు పట్టిసీమలో ట్రయల్ రన్...

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 11:34 AM
 

పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో నేడు ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏపీ జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. వరుసగా రెండో ఏడాది కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నేడు 24 పంపుసెట్లకూ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 14.9 అడుగులు ఉండగా పట్టిసీమ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే 14 అడుగుల నీటి మట్టం సరిపోతుంది. ప్రస్తుతం గోదావరి నుంచి 2,400 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. దీంతో, ఈ నీటిని కృష్ణా డెల్టాకు పంపితే, ఖరీఫ్ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు మంచి రోజు కావడంతో, పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 24 పంప్ సెట్ల ద్వారా అరగంట సేపు నీటిని ఎత్తిపోస్తారు.