మోదీ గురువు కన్నుమూత

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 10:36 AM
 

 


ప్రధాని నరేంద్ర మోదీని రాజకీయాల్లో ప్రవేశించాలని దిశానిర్దేశం చేసిన ప్రఖ్యాత రామకృష్ణ మఠం, మిషన్‌ అధ్యక్షుడు స్వామి ఆత్మస్థానందజీ మహరాజ్‌ (98) మృతిచెందారు. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం ప్రాణం విడిచారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మస్థానందజీ మరణం వ్యక్తిగతంగా తనకు పూడ్చలేని లోటని అన్నారు. తన జీవితంలో కీలక దశలో ఆయనతో గడిపానని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడు కోల్‌కతా వెళ్లినా స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు తీసుకునేవాడినని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. నేడు ఆయన మృతదేహానికి అంత్యక్రియలు బేలూరు మఠంలో నిర్వహించనున్నారు.