పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 01:40 AM
 

లండన్‌ : ప్రపంచ హాకీ లీగ్‌ సెమీఫైనల్‌ టోర్నీలో భారత్‌ జట్టు సత్తా చాటింది. దాయాది పాకిస్థాన్‌పై 7-1 తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలి నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన భారత జట్టు ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. ఆటగాళ్లు ఆకాశ్‌దీప్‌, హర్మన్‌ప్రీత్‌, తల్వీందర్‌సింగ్‌ రెండేసి గోల్స్‌, పర్‌దీప్‌ మార్‌ ఒక గోల్‌ చేశారు. పాక్‌ తరఫున మహ్మద్‌ ఉమర్‌ బుట్టా మాత్రమే ఒక్క గోల్‌ చేశాడు. పాక్‌పై గెలుపుతో భారత జట్టు హ్యాట్రిక్‌ విజయం సాధించింది. అంతకు ముందురోజు హాకీ వరల్‌‌డ లీగ్‌లో (హెచ్‌డబ్ల్యూఎల్‌) భాగంగా జరిగిన సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు విజయం నమోదు చేసింది. కెనడాతో శనివారం జరిగిన పూల్‌-బి మ్యాచ్‌లో టీమిండియా 3-0తో గెలిచింది. భారత్‌ తరఫున ఎస్‌వీ సునీల్‌ (5వ నిమిషంలో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (10వ నిమిషంలో), సర్దార్‌ సింగ్‌ (18వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు.చస్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 41తో నెగ్గిన సంగతి విదితమే. వరుసగా రెండు విజయాలతో భారత్‌కు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్‌‌త దాదాపు ఖాయమైనట్టే.