శ్రీకాంత్‌ ఖాతాలో ఇండోనేషియా టైటిల్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 01:37 AM
 

జకర్తా : భారత స్టార్‌ షట్లర్‌ కిదంబి శ్రీకాంత్‌ ఖాతాలో ఇం డోనేషియా ఓపెన్‌ సూపర్‌ సీరీస్‌ చేరింది. గత ఏప్రిల్‌లో సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో రన్నరప్‌తో సరి పెట్టుకున్న ఈ శ్రీకాంత్‌... అప్పుడే చెప్పిన విధంగా ఇండో నేసియా ఓపెన్‌ సూపర్‌ సీరీస్‌ టైటిల్‌ వేటలో సఫలమ య్యాడు. సీరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో శ్రీకాంత్‌ 21-11, 21-19 తేడా తో సకాయ్‌ (జపాన్‌)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసు కున్నాడు. ఇది శ్రీకాంత్‌కు తొలి ఇండోనేసియా సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ కాగా, అతని కెరీర్‌లో ఇది మూడో సూపర్‌ సీరీస్‌ టైటిల్‌. అతే కాకుండా ఓవరాల్‌గా ఈ టైటిల్‌ను సాధించిన రెండో భార త్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. అంతకుముం దు సైనా నెహ్వాల్‌ (2010) ఇండో నేసియా టైటిల్‌ గెలిచిన తొలి భా రత ప్లేయర్‌గా నిలిచింది. ఇండో ననేసియా ఫైనల్‌ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌... రెండో గేమ్‌లో మాత్రం చెమటోడ్చి సాధించుకున్నాడు. ప్రత్యర్థి సకాయ్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావ డంతో శ్రీకాంత్‌ ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు తన అనుభవాన్ని అంతా రంగరించిన శ్రీకాంత్‌ రెండు పాయిం ట్ల తేడాతో రెండో గేమ్‌ను దక్కిం చుకుని విజేతగా అవతరించాడు. ఇండోనేసియా సూపర్‌ సీరీస్‌ టైటిల్‌ను సాధించిన శ్రీకాంత్‌కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.


సొంతూళ్లో సంబరాలు


ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్‌ స్వగ్రామం గుంటూరు చంద్రమౌళినగర్‌లో ఆనందాలు వెల్లివిరిశా యి. శ్రీకాంత్‌ టైటిల్‌ను కైవసం చేసుకోవడం చెప్పలేనంత ఆనందంగా ఉందని శ్రీకాంత్‌ తండ్రి కేవీఎస్‌ కృష్ణ అన్నా రు. తండ్రుల దినోత్సవం రోజున కుమారుడు ఈ విధంగా తనకు బహుమతి ఇచ్చారని ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. శ్రీకాంత్‌ ఇండోనేషియా టెటిల్‌ను గెలుపొందడంతో తల్లిదండ్రులు కౄఎష్ణ, రాధాముకుంద ఒకరినొకరు స్వీట్లు తినిపించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, క్రీడాకారులకు పంచిపెట్టారు.