ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 01:03 AM

  విజయవాడ, సూర్యబ్యూరో : ‘‘పరిపాలనలో అత్యాధునిక, సాంకేతిక విధానా లతో కూడిన సంస్కరణలు అమలు చేయాలి. ఈ సంస్కరణలన్నీ పేదవాడిని కేంద్రంగా చేసు కుని రూపొందించాలి. సంస్కరణల ఫలాలు రాష్ర్టంలోని ప్రజ లందరికీ చేరాలి. ప్రధానంగా రాష్ర్టంలోని ప్రతిఒక్కరికీ దక్కాలి. అరులైన వారందరికీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరాల్సిందే. 1997లో తొలి విడత విద్యుత్తు సంస్కరణలు చేపట్టాం. ఆనాడు ఈ సంస్కరణలను కొందురు వ్యతిరేకించారు. కేంద్రీకతమై ఉన్న విద్యుత్తు రంగాన్ని మూడుగా విభజించి వికేంద్రికరించాం. ఏపి జెన్కో, ఏపి ట్రాన్స్‌కో, ఏపి డిస్కమ్‌లుగా విభజించి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ విభాగాలను చేశాం. ప్రత్యేకించి విద్యుత్‌ నియంత్రణ మండలి ఏర్పాటు చేశాం. ఆనాడు అలా విభజించి, పాలనా సంస్కరణలు అమలు చేసి, సరళీకృత విధానాలను అమలు చేయడాన్ని తప్పుబట్టినవారే ఇప్పడు ఈ విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రశంసిస్తున్నారు. ఇది ఒక రకంగా విద్యుత్తు రంగంలోని తొలి విడత సంస్కరణల విజయమే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం వచ్చింది. అంతర్జాతీయంగా విద్యుత్తు రంగంలో అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరిగింది. సహజ వనరులైన సౌర, పవన వినియోగంతో చౌకగా విద్యుదుత్పత్తిని చేపట్టడం అధికమైంది. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. విని యోగ దారులకు, చౌకయిన, నాణ్యమైన విద్యుతును అందించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడింది. ఇప్పడు . పవన, సౌర విద్యుత్తు, ఉత్పత్తి ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ విద్యుతును ప్రతి గ్రామంలోనూ ఉత్పత్తి చేసుకునే వీలుంది. ప్రతి గ్రామంలోను సోలార్‌, పవన విద్యుత్తు ఉత్పత్తి చేసి గ్రిడ్గకు అనుసంధానం చేసుకుంటే, రైతులందరికీ సాగుకు సరిపోగా మిగిలిన విద్యుతును గ్రిడ్‌కు అందించవచ్చు. అంటే తన పొలానికి విద్యుత్తుతోపాటు, మిగులు విద్యుత్తును గ్రిడ్‌ ద్వారా అమ్ముకునే వీలు ప్రతి ఒక్కరికీ కలుగుతుంది, దీని వల్ల ప్రతి వినియోగదారుడు ఉత్పత్తిదారుడై ఆదాయం పొందవచ్చు. గ్రామీణ సోలార్‌ మున్ముందు రైతుకు  కామధేనువులా ఆదా యం ఇస్తుంది. ఇక రాష్ర్టంలో విద్యుత్తు కొరత అనే మాటే విన్పించదు. రెండో విడత విద్యుతు సంస్కరణలన్నీ సామా న్యుడికి కేంద్రంగా చేసుకుని అమలు చేసేవే. అందుకే ఈ సంస్కరణ ఫలాలన్నీ సామాన్యు డికి అంకితం’’ అని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ రెండవ విడత విద్యుత్తు సంస్కరణలను విజయవంతం చెయ్య డానికి విద్యుత్తు సంస్థలు 5 అంచెల వ్యూహాన్ని రూపొందించాయి. భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్తుదే అధిక వాటా సౌర, పవన విద్యుతు త్పత్తికి ప్రోత్సాహం, సమర్థవంతమైన విద్యుత్తు వినియోగానికి మరిన్ని పటిష్ట మైన చర్యలు, సాంకేతిక, వాణిజ్య నష్టాల తగ్గింపునకు చర్యలు, ఆధునిక సరళీకృత విధానాల ద్వారా వినియోగదారునికి అత్యున్నత సేవలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు ప్రణాళికులు.


   కర్నూలు జిల్లాలోని 1000 మెగవాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంటును ఈ నెల 21న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘‘ఏరియల్‌ వ్యూ’’ ద్వారా పర్యవేక్షించనున్నారు. అంతర్జాతీయంగా అతి పెద్దదిగా గుర్తింపునొందిన కర్నూ లు సోలార్‌ పార్కు రాష్ట్రానికే మణిహారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంధనశాఖ మంత్రివర్యులు కళా వెంకట రావు, సీఎంఓ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌, ఉన్నతాధి కారు లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ టెలి కాన్ఫ రెన్సులో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపి జెన్కో ఎండీ కె. విజయానంద్‌, ఇంధన శాఖ సలహాదారు రంగనాథం, ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్‌ పరుచూరి, పి. ఉమాపతి, డిస్కమ్‌ సీఎండీలు ఎమ్‌.ఎమ్‌ నాయక్‌,  హెచ్‌.వై. దొర, ఏసీ సోలార్‌ కార్పోరేషన్‌ ఎండీ ఆదిశేషూ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ  గతంలో యూనిట్‌ సోలార్‌ విద్యుత్తు రూ. 16గా ఉండేదని, 2014 నాటికి రూ. 6.50కు చేరిందని ఇప్పడు ఇంకాస్త తగ్గి 2 రూపాయలకు పడిపోయినా ఆశ్చర్యం లేదని అన్నారు. సోలార్‌ విద్యుత్‌ ధరలు నింగినుంచి నేలకు దిగుతాయని అత్యంత చౌకగా యూనిట్‌ ధర అందుబాటులోకి వస్తుందని 15 ఏళ్ళ క్రితమే చెప్పాను అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రతి గ్రామం విద్యుత్తు సుస్థిరతో ఉండేలా భవిష్యత్‌ కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంత గ్రిడ్‌లకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని అజయ్‌జైన్‌, విజయానంద్‌ వివరించారు. రాష్ర్టంలో ప్రతి గ్రామమూ సోలార్‌ గ్రిడ్‌గా ఏర్పాటయ్యేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నా మని చెప్పారు. రెండో విడత సంస్కరణల అమలు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ రంగాలను మరింత పటిష్టవంతం చేయాలని ఉద్ఘాటించారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టరీ (పిఎల్‌ఎస్‌) ను పెంచు కోవాలని అవసరానుసారం అధునాతన సాంకేతిక యంత్రాలతో పునరుద్ధరిం చాలని ఆదేశించారు.


ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రసార, పంపిణీ నష్టాలను 6 శాతం కంటే తక్కువగా చేసేందుకు చర్యలు చేపట్టా లన్నారు. పంపిణీ సంస్థల ఆర్థికస్థితిని మెరుగుపరచాలని, పంపిణీ సంస్థలు నిర్వాహణమైన, ఆర్థికపరమైన లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర పభుత్వ ‘‘ఉదయ్‌’’ పథకం చేపట్టింది. తద్వారా డిస్కంలు ఆర్థిక వెసలుబాటు పొందగలమని పేర్కొన్నారు. పర్యావసానంగా విద్యుత్‌ చార్టీలు తగ్గించవచ్చ న్నారు. మనందరి అంతిమ ధ్యేయం ప్రజాప్రయోజనార్థం ఏడాదిలో కరెంటు చార్జీలు తగ్గించటమే.


    ఈ చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుదాం అని అన్నారు. విద్యుత్‌ సంస్థల రుణాలను తగ్గించేందుకు, సమర్థ ఆర్థిక విధానాలలో భాగంగా వివిధ బ్యాంకులలో అధిక శాతం వడ్డీలున్న రుణాలను, తద్వారా ఆ సంవత్సరం 2016-17లో దాదాపు రూ. 100 కోట్లు ఆదా అయ్యా అని విజయా నంద్‌, దినేష్‌ పరుచూరి తెలిపారు. అందుకు స్పందిస్తూ పి.ఎఫ్‌.సి. బ్యాంకు ద్వారా తీసుకొన్న రూ. 4,000 కోట్ల రుణాలను, 8 షెడ్యూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఒప్పిస్తామని తెలిపారు. దీని ద్వారా మరో రూ.100 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ర్టంలో రెండో విడత విద్యుత్తు సంస్కరణలు వేగవంతం చేయాలని వాటి ఫలితాలు సామాన్యులందరికీ అందాలని సీఎం చంద్రబాబు మరోమారు ఉద్ఘాటించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com