ముగిసిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు

  Written by : IANS Updated: Mon, Jun 19, 2017, 12:53 AM
 

  విజయవాడ, సూర్య బ్యూరో : కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ ద్వారా నిర్వహిస్తున్న సివిల్స్‌ ప్రిలిమినరీ 2017 పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడులు తెలిపారు. ఆదివారం నగరంలో నిర్వహించిన సివిల్స్‌ ఫిలింనరీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టరులు పర్య వేక్షించారు. మాంటిస్సోరి, సిద్దార్థ మహిళా కళాశాల, పటమటలోని  స్టెల్లా, లయోలా కళాశాలలో, కృష్ణవేణి పాఠశాల పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు  అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద  పటిష్ట పోలీసు బందోబస్తీని ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్‌ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కలిగేలా పర్యవేక్షకులను నియమించడం జరిగిందన్నారు. నగరంలో  25 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఉదయం నిర్వహించిన పరీక్షకు 11,567 మంది అభ్యర్థులు హాజరు కావలసి వుండగా 4,311 మంది అభ్యర్థులు హాజరుకాగా 37.27 శాతం మధ్యాహ్నం 4,235 మంది అభ్యర్దులు హాజరుకాగా 36.62 శాతంగా నమోదు అయ్యిందన్నారు. పరీక్షకు హాజరయిన అభ్యర్ధులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవక తవకలకు తావు లేకుండా విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని జవాబు పత్రాలను భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రధాన తపాలా కార్యాలయానికి చేర్చడం జరుగుతుందని  అనంతరం వాటిని ఢిల్లీలోని యుపియస్‌సి కార్యాలయానికి అందజేయడం జరిగిందని వారు తెలిపారు. పర్యవేక్షణలో జెసి డి.మార్కేండే యులు, డీఆర్వో ఎం.వేణుగోపాల్‌రెడ్డి, అర్బన్‌ తాహశీల్దార్‌ తదితరులున్నారు.