నిరుద్యోగులకు డీఆర్‌డీఓ శుభవార్త. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో 311 పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొదట 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించిన ఆ తర్వాత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA కోసం 18 పోస్టుల్ని కలిపి మొత్తం 185 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ లో 126 కొత్త పోస్టుల్ని కలిపి మొత్తం 311 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 311
విభాగాలు:
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81
మెకానికల్ ఇంజనీరింగ్- 82
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12
మెటల్లార్జీ- 10
ఫిజిక్స్- 14
కెమిస్ట్రీ- 7
కెమికల్ ఇంజనీరింగ్- 11
ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17
సివిల్ ఇంజనీరింగ్- 3
మ్యాథమెటిక్స్- 4
సైకాలజీ- 10 పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు రూ.100 ; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు
దరఖాస్తుకు ఆఖరి తేదీ 2020 జూలై 10
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa