శ్రీకాకుళం ఎంపీ వివాహ విందులో బాలకృష్ణ

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 12:38 AM
 

విశాఖపట్నం, సూర్య ప్రధాన ప్రతినిధి : శ్రీకాకుళం పార్లమెంట్‌ సభ్యుడు కింజ రాపు రామ్మోహన నాయుడు వివాహ విందు కార్యక్రమానికి ఆదివారం హిం దూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ  హాజరయ్యారు. కోట బొమ్మాలి మండలంలోని ఆయన స్వగ్రామం నిమ్మాడలో విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. భవానీ గ్రానైట్స్‌ సమీ పంలో కింజరాపు ఎర్రన్నాయుడు ప్రాంగణంలో వివాహ విందు జరిగింది. జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కింజరాపు కుటుంబ అభిమానులతో పాటు వివిధ పార్టీల నాయకులు, అధికారులు  ఈ విందుకు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి, ఎస్పీ బ్రమ్మారెడ్డి, ఎమ్మె ల్యేలు గౌతు శ్యాం సుందర శివాజీ, బి. అశోక్‌, బి. రమణమూర్తి, కె. వెంకట రమణ, గుండ లక్ష్మీదేవి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ సంగీత దర్శ కుడు వందేమాతరం శ్రీనివాస్‌ నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యలలో ఏర్పాట్లు చేశారు.