తిరుపతిలో సెల్‌కాన్‌ మెుబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 12:36 AM
 

తిరుపతి, సూర్య ప్రతినిధి : తిరుపతి సిగలో సెల్‌ పువ్వు పూయనుంది. త్వరలో అత్యాధునిక ఫోన్ల తయారీకి కేంద్రంగా అవతరించనుంది. ఈ నెల 22న రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్మించిన సెల్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. సెల్‌కాన్‌ సంస్థ ఇక్కడి నుంచి నెలకు 4 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయ నుంది. వాటిని దేశీయ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. ఆ తర్వాత మరో మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు రానున్నాయి.రేణిగుంట విమానాశ్ర యానికి సమీపంలో రెండు ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లను (ఈఎంసీ) ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చ రింగ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేసి ఈప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఈఎంసీ-1 హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో సెల్‌కాన్‌, లావా, మైక్రో మ్యాక్స్‌, కార్బన్‌ కంపె నీలు తమ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిపి భారీగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఇందులో శరవే గంగా యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి తయారీకి సిద్ధమైన తొలి కంపెనీ సెల్‌ కాన్‌. 2015 నవంబరులో ఈఎంసీ-1కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శం కుస్థాపన చేశారు. ఏడాది క్రితం సెల్‌కాన్‌ కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి ఇటీవలే పూర్తి చేసింది. 22న యూని ట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. రేణిగుంటకు సమీపంలోని వికృతమాల వద్ద 500 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రా మిక మౌలిక సదుపా యాల కల్పన సంస్థ మరో ఈఎంసీ-2ను అభివృద్ధి చేస్తోంది.


40 వేల మందికి ఉద్యోగావకాశాలు


సెల్‌కాన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసిన ఈఎంసీ-1 ప్రాంతంలో వచ్చే మొబైల్‌ కంపెనీలన్నింటిద్వారా మొత్తం 40వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యో గావకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌-1లో ఏర్పాటవు తున్న ఈ నాలుగు కంపెనీల నుంచి ఏటా 7 కోట్ల సెల్‌ఫోన్లు తయారు కానున్నా యి. దేశీయ మొబైల్‌ మార్కెట్‌లో ఈ నాలుగు కంపెనీల వాటా 45 శాతం.


తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లో ఈ కంపెనీలు పెట్టబోయే పెట్టుబడులు, వాటి వివరాలు : సెల్‌కాన్‌: దేశీయ మొబైల్‌ తయారీ సంస్థల్లో ఐదో అతిపెద్ద మార్కెట్‌ ఉన్న సంస్థ. 20 ఎకరాల విస్తీర్ణంలో యూనిట నెలకొల్పింది. రూ. 150 కోట్ల పెట్టు బడి. సెల్‌కాన్‌ ఇక్కడ యూనిట్‌ను మరింత విస్తరించనుంది. ఆరంభంలో 2500మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. 2020 కల్లా ఈ కంపెనీ యూనిట్‌ నుంచీ 10వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకా శాలు లభించనున్నాయి. మొబైల్‌ తయారీతోపాటు, వాటి పరికరాలను కూడా ఆ సంస్థ ఇక్కడి నుంచీ తయారు చేయనుంది. లావా: ఈ సంస్థ ఇక్కడ సోజో మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. మొత్తం 20 ఎకరాల్లో తయారీ యూని ట్‌ను నెలకొల్పనుంది. రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఆరంభ దశలో నెలకు 5 లక్షల మొబైల్‌ ఫోన్లను ఇక్కడి నుంచి తయారు చేయనుంది. 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. కార్బన్‌: 15 ఎకరాల విస్తీర్ణంలో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. రూ.200 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 2వేల మందికి ఉద్యోగాలు కల్పించనుం ది. నెలకు ఈ యూనిట్‌ నుంచీ 5లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. మైక్రో మ్యాక్స్‌: 20 ఎకరాల విస్తీర్ణంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయ నుంది. రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.