రైతు సమస్యల పరిష్కారం కోసం 19న కలెక్టర్లకు వినతిపత్రాలు

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 12:23 AM
 

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : జిల్లాల్లోని రైతాంగం ప్రధాన సమస్యలను ప్రసా ్తవిస్తూ, రైతులకు వెంటనే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు న్యాయం చేయాలని కోరు తూ జూన్‌ 19న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణ యించిందని ఏపీ పీసీసీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి వెల్లడించారు.  కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటానికి రాష్ర్టంలోని రైతాంగం అండగా నిలవాలని కోరుతు న్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుంచీ రాష్ర్టంలో రైతాంగం తీవ్ర కష్టాల్లోకి నెట్టబడిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రాధాన్యత వ్యవసాయం మీద లేకపోవడమే దీనికి కారణ మని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ ప్రారంభమైందని రైతులు సాగుచేసేందుకు తగిన పెట్టుబడులు లేక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బ్యాంకుల నుండి రుణాలు అందడంలేదు చంద్రబాబు నాయుడు అలియాస్‌ అబద్దాల నాయుడు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేయడంలేదని విమ ర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారంనాడొక ప్రకటనను విడుదల చేశారు. బాబు మోసం చేయడం వలన బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడంలేదని ప్రైవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నా పెట్టుబడులకు డబ్బులు దొరకడం లేదని పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అకస్మికంగా పెద్దనోట్లరద్దుచేసి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. నోట్లరద్దు దుష్పరిణామా లకు దేశంలోని రైతాంగం అనేక కష్టాలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. గత ఏడాది పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్రంగా నష్టపో యిందని, ఈ పరిణామాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిం దని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెల్లిస్తామన్న ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రభుత్వం చేల్లించకుండా అమానవీ యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ర్టంలో రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిటీ, భీమా బకాయిలను ప్రభుత్వం  ఇంతవరకూ చెల్లించలేదని పేర్కొన్నారు. గత మూడేళ్ళుగా ప్రభుత్వం రూ.5017 కోట్ల రూపాయలు ఇన్‌ పుట్‌ సబ్సిడీ కింది చెల్లించాల్సి బాకీ రైతులకు ఇంతవరకూ చెల్లించలేదని పేర్కొ న్నారు. గత ఏడాది రాష్ర్టంలోని సగానికిపైగా మండలాలను కరువు మండలా లుగా ప్రభుత్వం ప్రకటించిందని కానీ కరువు సహాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లక్షలాదిగా రైతులు, రైతుకూలీలు వలసలు వెళ్ళారని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ ప్రభుత్వం రైతాంగంపట్ల ఎంత నిర్ల క్షంగా వ్యవహరిస్తుందో అర్దమవుతోందని పేర్కొన్నారు. జూన్‌ 16న బ్యాం కర్లతో (ఎస్‌.ఎల్‌.బి.సి) సమావేశం జరిపిన ప్రభుత్వం వ్యవసాయ రుణాలు,  రైతులకు పంటరుణాలు ఇస్తామని రుణప్రణాళికలు ప్రకటిస్తున్నప్పటికీ ఆచర ణలో అమలు కావడంలేదని తెలిపారు. గత ఏడాది బ్యాంకర్ల లెక్కల ప్రకారమే నిర్దేశించుకున్న రుణప్రణాళికలో 30 శాతం కోత విధించారని, మిగిలిన శాతం కూడా రైతులకే రుణాలు ఇచ్చామని గ్యారంటీగా చెప్పడంలేదని తెలిపారు. కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తెచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా మరో కొత్త చట్టంపేరిట టిడిపి ప్రభుత్వం నాటకమాడుతోందని విమర్శించారు. ఈ కారణంగా బ్యాం కులు కౌలురైతులకు ఎలాంటి సహాయం చేయడంలేదని పేర్కొన్నారు.