తమిళ రైతులకు రజనీ ‘కోటి’ సాయం

Updated: Sun, Jun 18, 2017, 03:52 PM
 

చెన్నై: తమిళనాడు రైతులను ఆదుకుంటానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన చెన్నైలో నేషనల్‌ సౌత్‌ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే దిల్లీలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని చెబుతూ వారికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదొక సూచన అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


దాదాపు రెండున్నర నెలలకు పైగా తమిళ రైతులు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. రైతుల రుణాలను రద్దు చేయాలని, కరవు సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ వినూత్నంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రైతుల ఆందోళనను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం పళనిస్వామి హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.

Andhra Pradesh E-Paper


Telangana E-Paper