పోర్చుగల్ అడవుల్లో మంటలు

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 18, 2017, 03:29 PM
 

లిస్బన్ : పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు రోడ్డు పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 39 మంది తీవ్రంగా గాయపడినట్లు పోర్చుగల్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. మంటలను అదుపు చేసేందుకు 160 అగ్నిమాపక యంత్రాలు, వందల సంఖ్యలో సిబ్బంది శ్రమిస్తుంది. అడవుల్లో ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం గత కొన్ని సంవత్సరాలుగా చూడలేదని ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని అక్కడి అధికారులు తెలిపారు.