23లోపు రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటిస్తాం

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 18, 2017, 02:43 PM
 

న్యూఢిల్లీ : ఈ నెల 23 లోపు రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వన్‌తో భేటీ ముగిసిన అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేస్తామని ప్రకటించారు. విపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నామని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార పార్టీ బీజేపీ వేగంగా సంప్రదింపులు జరుపుతోంది.