ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీర కట్టిన రోబోలు..కరోనా బాధితులకు సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:50 PM

రోబోట్లు చీర కట్టుకున్నాయి. హెల్త్ వర్కర్లు తరహాలో తెల్లసూట్ కూడా వేసుకున్నాయి. కరోనా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్న ఈ రోబోలను ఓ రెస్టారెంట్ యజమాని అందించారు. గౌహతీలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఎస్ఎన్ ఫరీద్ ఏడాదిన్నరగా తమ కస్టమర్లకు రోబోట్ల ద్వారా ఆహారం, పానీయాలు అందించేవారు. ఇప్పుడు ఆ రోబోట్లను కరోనా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్లకు సాయం చేసేందుకు అందించారు. ఈ రోబోట్ల సాయంతో వైద్యులు బాధితుల వద్దకు వెళ్లకుండానే వేరే చోట కుర్చొని మాట్లాడగలుగుతున్నారు. ఈ రోబోట్లు ఆహారం, మందులు కూడా అందిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa