చేదోడు పథకం ద్వారా పది వేల రూపాయలు అందించడం చాలా సంతోషంగా ఉందని కౌతాలం టైలర్లు అన్నారు. మండలంలోని టైలర్ అందరూ కలసి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేకే కట్ చేసి ఆదొని డివిజన్ టైలర్స్ అసోసియేషన్ వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ సెక్రెటరీ కలిద్ భాష మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం టైలర్లను గుర్తించి ఆదుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.కౌతాళం టైలర్లకు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు దేశాయ్ కృష్ణ , మాజీ సర్పంచ్ అవతారం, సక్రి తిక్కాయ , వడ్డే రాము , ఆదోని టైలర్స్ యూనియన్ అధ్యక్షులు షబ్బీర్ , ఉపాధ్యక్షులు అయుబ్ , ట్రెజరర్ చాంద్ భాష , కౌతాళం టైలర లు ఆనంద్ , నాగరాజ్ , మారేశ్ , వెంకోబా , మహాదేవ , రమేశ్ , కాలప్పా , M S అరుణ్ , హనుమేశ్ , ప్రభు , జోషెఫ్ , దత్తా, మనోహర్ , తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa