కొన్ని యాప్స్ అనవసరమైన యాడ్స్‌తో యూజర్లకు చికాకు పుట్టిస్తుంటాయి. అలాంటి 30 యాప్స్ విషయంలో గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాటిని బ్యాన్ చేసి ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్స్ అన్నీ యూజర్లకు అవసరం లేని యాడ్స్ చూపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా యూజర్ల ప్రమేయం లేకుండా లింక్స్ క్లిక్ చేసి ఇతర వెబ్‌సైట్లకు తీసుకెళ్తున్నాయి. దీంతో వీటిని ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్‌ని ఇన్‍స్టాల్ చేసుకున్న యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి వాటిని తొలగించాలని వైట్ ఆప్స్ సెక్యూరిటీ రీసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. ఒక వేళ మీరు కూడా ఈ యాప్ లను డౌన్‌లోడ్ చేస్తే వెంటనే తొలగించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa