ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఈస్టర్న్ రీజియన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. ఆసక్తి గల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.iocl.com/ ఓపెన్ చేసి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 404
టెక్నీషియన్ అప్రెంటీస్- 221
ట్రేడ్ అప్రెంటీస్- 168
ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్)- 15
దరఖాస్తు ప్రారంభం- 2020 మే 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 18
విద్యార్హత- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఐటీఐ
వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa