మచిలీపట్నంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప వలకు చిక్కింది. చేప మూడు టన్నుల వరకు బరువు ఉండడంతో వలలు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. దీన్ని 'టేకు చేప' అంటారని మత్స్యకారులు తెలిపారు. దీని ధర వేలల్లో పలుకుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa