టెన్త్ తర్వాత ఎంచుకునే కోర్సులే కెరీర్‌ను నిర్ణయిస్తాయి. అందుకే పదో తరగతి పాస్ కాగానే కోర్సుల్ని, కెరీర్‌ను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన కోర్సుల్ని ఎంచుకుంటేనే కెరీర్ కూడా హ్యాపీగా సాగిపోతుంది. లేదంటే కెరీర్ గందరగోళంగా మారడం ఖాయం.మీకు సైన్స్ అంటే ఇష్టమా? అయితే టెన్త్ తర్వాత సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌తో కోర్సులు చేయొచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్, వైద్య రంగం వైపు వెళ్లాలనుకునేవాళ్లు సైన్స్ కోర్సుల తర్వాత ఎంసెట్, జేఈఈ, బిట్‌శాట్, నీట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందొచ్చు. మ్యాథ్స్, సైన్స్ ఇష్టమైతే MPC - మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, MEC - మ్యాథ్స్+ఎకనమిక్స్+కామర్స్, MBPC - మ్యాథ్స్+బయాలజీ+ఫిజిక్స్+కెమిస్ట్రీ, BiPC - బయాలజీ(బాటనీ, జూవాలజీ)+ఫిజిక్స్+కెమిస్ట్రీ కోర్సులు ఎంచుకోవచ్చు.మీకు బిజినెస్ అంటే ఇష్టమా? అయితే కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఇంటర్‌లోనే సీఈసీ కోర్సులుంటాయి. చార్టెర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, అకౌంటెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లాంటి కెరీర్ కోసం కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవాలి. కామర్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీ, బిజినెస్ లా లాంటి సబ్డెక్ట్స్ ఉంటాయి. కామర్స్ ఇష్టమైతే CEC - సివిక్స్+ఎకనమిక్స్+కామర్స్, HEC - హిస్టరీ+ఎకనమిక్స్+సివిక్స్ లేదా కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు.సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్ కోర్సులు ఎంచుకోవాలి. జర్నలిజం, లిటరేచర్, సోషల్ వర్క్, టీచింగ్ ఫీల్డ్స్‌లో కెరీర్ తీర్చిదిద్దుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంగ్వేజెస్ కోర్సులు చేయొచ్చు. పదో తరగతి తర్వాతే ప్రొఫెషనల్ కోర్సుల్నీ ఎంచుకోవచ్చు. డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఫిట్టర్, మెకానిక్, టెక్నీషియన్ కోర్సులు చేయొచ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ కోర్సులు చేయొచ్చు.టెక్నికల్ అయితే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, గార్మెంట్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ విభాగాల్లో డిప్లొమా కోర్సులుంటాయి. మీరు టెన్త్ తర్వాత కెరీర్ ఎంచుకునే విషయంలో, జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఇష్టాలు, అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సుల్ని ఎంచుకోవాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఒత్తిడితో కోర్సుల్ని ఎంచుకుంటే తర్వాత కెరీర్‌లో ఇబ్బంది పడాల్సింది మీరే. అందుకే మీ అభిరుచితో పాటు మంచి భవిష్యత్తు ఉండే కెరీర్ ఎంచుకోవడం మంచిది. ఏమాత్రం అయోమయం ఉన్నా కెరీర్ కౌన్సిలర్‌ను కలిసి సలహాలు తీసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa