రాశి-మేషం
అంతగా అనుకూలించదు. సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. కీలక విషయాల్లో కుటుంబసభ్యులు సలహాలు మేలు చేస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థిక సమస్య తొలగిపోతుంది. అవకాశాలు అందివస్తాయి. గృహమార్పు ఆలోచన సాగదు.
రాశి- వృషభం
పనులను సులువుగా పూర్తి చేస్తారు. మీ శ్రమకు దైవ బలం తోడవుతుంది. ఆర్థికంగా అనకూల ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ముందున్న సవాళ్ళను ఎదుర్కుంటారు.
రాశి-మిధునం
విందులు, విహారాలు, వినోదాలకు ఆటంకాలు. కాలం శుభప్రదంగా ఉంది. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. మనోవాంఛలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తాం. దూర ప్రయాణ భావనలుంటాయి కానీ పరిస్థితులు అనుకూలించవు.
రాశి-కర్కాటకం
తగిన విశ్రాంతి లభిస్తుంది. మీమీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక ఆలోచనలు సాగుతాయి. కొన్ని అనుకోని సమస్యలుంటాయి.
రాశి- సింహం
కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. శుభ సమయం. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి.
రాశి-కన్య
అధికారిక ప్రయాణాలకు అవకాశం లేదు. కీలక సందర్భాల్లో తోటి వారి సలహాలు అవసరమవుతాయి. మీ బుద్ధి బలంతో అందరి ప్రశంసలను అందుకుంటారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు.
రాశి-తుల
స్నేహాలు విస్తరిస్తాయి. శుభకాలం కొనసాగుతోంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో తోటి వారికి ఆదర్శవంతంగా నిలుస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అందరి సహకారం లభిస్తుంది.
రాశి- వృశ్చికం
దగ్గరి ప్రయాణాలకు కూడా అవరోధం ఏర్పడుతుంది. శుభకాలంగా గొచరిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విందులు వినోదాలకై కాలం, ధనం, వెచ్చించే అవకాశం ఉంటుంది. రుచికరమైన భోజనం ఉంటుంది.
రాశి-ధనస్సు
ఉద్యోగస్తులకు ఒత్తిడులు తగ్గుతాయి. సమాజంలో కీర్త ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులు ఇట్టే పూర్తవుతాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గడ్డుకాలం. ఇంటిలో కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది.
రాశి-మకరం
చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శ్రద్ధగా పనిచేయండి అనుకున్నది సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు అందుకోలేరు.
రాశి-కుంభం
వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకై చేసే ప్రయత్నాలు ఫలించవు. స్థిరమైన నిర్ణయాలతో మంచి చేకూరుతుంది. కీలక పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. సప్తమ చంద్రబలం బాగుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
రాశి-మీనం
ఆర్థిక పరిస్థితి మరింత క్షిణిస్తుంది. పట్టుదలతో వ్యవహరించి ఒక ముఖ్యపనిని పూర్తి చేస్తారు. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. షష్ఠి స్థానంలోని చంద్రబలం శుభాన్నిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు నిరాశాజనకంగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa