జీవితాన్ని సహజంగా కాకుండా అర్ధాంతరంగా అంతం చేసుకోవడమే ఆత్మహత్య. ఇది మనోరుగ్మతల్లోనే అతి తీవ్రమైనది. జీవితం అంటేనే గెలుపు ఓటములు కలగలిసిన ప్రయాణం. కానీ గెలుపే జీవితం కాదు. ఓటమిపాలైతే ఇక జీవితమే వ్యర్థం అనుకోవడమూ సరైందికాదు. నేటి సమాజంలో చాలా మందికి తమ జీవితంపై సరైన అవగాహన, ఆశావహ దృక్పథం లేకపోవడమే ఆత్మహత్యల దిశగా వారిని నడిపిస్తోంది. ఒక్క క్షణం పాజిటివ్‌గా ఆలోచించగలిగే శక్తినీ కోల్పోయి, క్షణికావేశంతో తమ జీవితాలను తామే బలి తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలనేవి సాధారణమైపోయాయి. ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలేమైనా ఒక వ్యక్తి మనసులో ఆత్యహత్య గురించి ఆలోచించడం మంచిది కాదు. మనసులో ఇలాంటి ఆలోచనలు రాకుండా వాటిని నాశనం చేయాలి. లేదా చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్యహత్యకు పాల్పడేవారు మొదట మనసులో తాము బతికుండటం అనవసరం, తమవల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని భావిస్తుంటారు. మనసులో గట్టిగా నిర్ణయించుకుంటారు. తాము తప్ప మిగిలినవారంతా సంతోషంగా ఉన్నారనుకుంటారు. ఇలాంటివారు తాము ఎక్కువ రోజులు సంతోషంగా గడపలేమని భావిస్తూ, ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో కారణాలను వెతుక్కుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు, ప్రేమలో విఫలమయ్యామని ప్రేమికులు, ఒత్తిడి తట్టుకోలేమని, అప్పులు ఎక్కువయ్యాయని పెద్దలు, ఇంకా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు.. ఇలా చాలా మంది మనసును చంపుకుని బతుకుమీద ఆశను వదులుకోని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఆ సమయంలో వాళ్లు తమ కుటుంబీకుల గురించి, తమ సన్నిహితుల గురించి ఆలోచించరు. ఒక్క క్షణం ఆలోచించండి. నిండు నూరేళ్లను మీ చేతులారా అంతం చేసుకోకండి. ఆత్మహత్య చేసుకోకుండా సమస్యపై గట్టిగా పోరాటం చేయండి. బతికి సాధించండి.
చిన్నచిన్న విషయాలకే విలువైన జీవితాన్ని బలి తీసుకోకుండా ఒక్క క్షణం ఆలోచించండి. ఇలా చేయండి..
ఆత్మహత్యలు క్షణికావేశంలోనే జరుగుతుంటాయి. అందుకే ముందుగా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి.
కొద్దిసేపు మౌనంగా ఉండడం మంచిది.
ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే కొన్ని నిమిషాల పాటు అంకెలు లెక్కపెట్టాలి.
కడుపు నిండా చల్లటినీరు తాగాలి.
ఒంటరిగా గడపకుండా మీ సమస్యను స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ పంచుకోవాలి.
తల్లిదండ్రులు నలుగురి మధ్యా గడపండి.
కుటుంబ వ్యవహారాల్లో బాధ్యులు కావాలి.
పరధ్యానంగా ఉండకూడదు.
వేళకు భోజనం చేయాలి.
దూర ప్రయాణాలు చేయండి. మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి గడపండి.
మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెట్టేవారికి దూరంగా ఉండండి.
సామాజిక పనుల్లో నిమగమయ్యేందుకు ప్రయత్నించాలి.
మీకు నచ్చిన ఆహార పదార్థాలు తినండి.
మిమ్మల్ని అవమానపరిచేవారు, మీపై సెటైర్లు వేసేవారి వద్దకు వెళ్లకండి.
మంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోండి.
స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.
ఎదుటివారిని నవ్విస్తూ, అందరితో ఆనందంగా గడపాలి.
నచ్చిన సినిమా చూడటమో, పాటలు వినటమో చేయాలి.
ఎక్కువ సమయం నిద్రపోవాలి. రాత్రిల్లో మేల్కొని ఉండకూడదు.
ఆత్మహత్యల నివారణకు కొన్ని ఎన్జీఓస్, హెల్ప్ లైన్ నంబర్లు..
ఇండియా: ఇంటర్నేషనల్ బైపోలార్ ఫౌండేషన్ : +91-8888817666
జీవన్ ఆస్తా హెల్ప్ లైన్ : టోల్ ఫ్రీ : 1800 233 3330
రోష్ని ట్రస్ట్:
+91 40 6620 2000, +91 40 6620 2001
సికింద్రాబాద్
వన్ లైఫ్ సంస్థ
+91 7893078930
హైదరాబాద్
దర్శిక సంస్థ
+91 040 27755506, +91 040 27755505
సికింద్రాబాద్
మాక్రో ఫౌండేషన్ - సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్ డెస్క్
+91 040 46004600
హైదరాబాద్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa