ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నం ఎందులో ఉడికించి తింటే మంచిది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 14, 2020, 10:42 AM

నేటి సమాజంలో అత్యధిక మంది ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నమే. మూడు పూటల్లో కనీసం ఒక్క పూటైనా అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. శరీరానికి కావల్సిన శక్తి, కార్బోహైడ్రేట్లు కూడా అందుతాయి. ఒకప్పుడు బియ్యాన్ని పాత్రలో నీళ్లు వేసి ఉండికించి వార్చేవారు. అందులో ఉండే నీరు (గంజిని) వంచేసి అన్నాన్ని తయారు చేసేవారు. అయితే, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెజర్ కుక్కర్లు ఉంటున్నాయి. దీంతో అంతా కుక్కర్లోనే అన్నాన్ని వండుతున్నారు. పైగా ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం సులభమే కాకుండా అన్నం పాడవుతుందనే బెంగ కూడా ఉండదు. అయితే ప్రెజర్ కుక్కర్ అన్నం మంచిదా? లేక ఉడికించి గంజి తీసేసే అన్నం మంచిదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించే అన్నంతో పోల్చితే పాత్రలో ఉడికించే అన్నంలో కెలోరీల శాతం తక్కువ.100 గ్రాముల బాయిల్డ్ రైస్‌లో 130 కెలోరీలు ఉంటే.. కుక్కర్‌లో ఉడికించే అన్నంలో 151 కెలోరీలు ఉంటాయని. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డీఏ) తెలిపింది. బాయిల్డ్ రైస్‌లో కొందరు అవసరం కంటే ఎక్కువ నీటిని ఉడికించి ఆ గంజిని పారబోస్తారు. దీని వల్ల అందులో ఉండే పోషకాలన్నీ బయటకు పోతాయి. బియ్యం త్వరగా ఉండుకుతాయనే ఉద్దేశంతో చాలామంది ముందుగా వాటిని నానబెట్టి కడుగుతారు. అలా చేసినా సరే పోషకాలన్నీ పోతాయి. బీన్స్, బంగాళా దుంపల్లో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్లే బియ్యంలో కూడా ఉంటాయి. ప్రెజర్ కుక్కర్లో ఆవిరిపై ఉడికించే అన్నంలో 33.88 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయని, పాత్రలో ఉడికించే అన్నంలో 28.17 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయని యూఎస్‌డీఏ పేర్కొంది.బియ్యాన్ని పాత్రలో ఉడికించి గంజిని పారబోసినట్లయితే అందులో ఉండే న్యూట్రీషన్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కొవ్వులు కూడా బయటకు పోతాయి. అన్నంలో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు పోటాషియం, ఫోలేట్, పాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ కూడా వంటి న్యూట్రీషియన్లు ఉంటాయి. అన్నాన్ని వార్చినట్లయితే.. అవన్నీ బయటకు పోతాయి. యూనివర్శిటీ ఆఫ్ అర్కన్సాస్ పరిశోధనల ప్రకారం.. బియ్యాన్ని శుద్ధి చేసేప్పుడు వాటిపై ఊక, సుక్ష్మజీవులు తొలగిపోతాయి. వాటితోపాటే బియ్యంలోని ఫైబర్, పోషకాలు కూడా బయటకు పోతాయి. ప్రెజర్ కుక్కర్‌లో ఆవిరితో ఉడికించే అన్నంలో అన్నిరకాల పోషకాలు ఉంటాయి. పాత్రలో బియ్యాన్ని ఉడికించడం వల్ల కలిగే ప్రయోజనం.. అందులో ఉండే పిండి పదార్థం తొలగిపోవడం ఒక్కటే. అదే ప్రెజర్ కుక్కర్‌లో అన్నమైతే పిండి పదార్థాలు అన్నాన్ని అంటుకుని ఉంటాయి. అందుకే, పులిహోరా, బిర్యానీలు చేయడానికి ఎక్కువ మంది బాయిల్డ్ రైస్‌నే వాడతారు. ప్రెజర్ కుక్కర్లో అన్నం ఉడికేందుకు సరిపడా నీటిని మాత్రమే వాడతారు. కాబట్టి.. ఆవిరి ద్వారా ఎక్కువ పోషకాలు బయటకు పోయే అవకాశం ఉండదు. మనం కొనుగోలు చేసే బియ్యంలో ఎన్నోరకాల ఫంగస్ బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో అఫ్లాటాక్సిన్స్లోని అనే ఫంగల్ పాయిజన్ లివర్ క్యాన్సర్‌ కలిగిస్తుంది.బియ్యాన్ని 100 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉడికించినా సరే ఈ ఫంగస్ చావదు. ప్రెజర్ కుక్కర్‌లో 100 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద బియ్యం ఉడుకుతుంది. కాబట్టి.. ఆ ఫంగస్ కొంతవరకు నశిస్తుంది. ఫలితంగా లివర్ కూడా బాగుంటుంది. ప్రెజర్ కుక్కర్‌లో వండే అన్నానికి, పాత్రలో ఉడికించే అన్నానికి మధ్య ఉన్న వ్యత్యాసం. కాబట్టి ప్రెజర్ కుక్కర్ ఆహారం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. కుక్కర్‌లో అన్నం శరీరానికి వేడి చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ఒక వేళ మీరు పాత్రలో అన్నం వండుతున్నట్లయితే తప్పకుండా గంజిని తాగండి. అప్పుడు అన్నంలోని పోషకాలు ఎక్కడికీ పోవు.కరోనా విజృంభిస్తున్న సమయంలో బయటకు వెళ్లడం ప్రమాదకరం. కానీ, మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ ను సంప్రదించడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో మీకో శుభవార్త. ఈ యాప్ తో ఇంటి దగ్గర నుండే డాక్టర్ ను సంప్రదించి వైద్య సలహాను పొందవచ్చు. అందుకోసం ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి.getaayu.medcords.com/Cn88






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa