యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)..136 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ట్రెయినీ, అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 136 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు జూన్ 22, 2020 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ www.ucil.gov.in/ చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఉద్యోగం పేరు: గ్రాడ్యుయేట్ ట్రెయినీ...
ఖాళీలు: మొత్తం 136
విభాగాల వారీ ఖాళీలు: 136 గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ (కెమికల్)- 4, మైనింగ్ మేట్ సీ- 52, బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్ ఏ- 3, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బీ- 14, బ్లాస్టర్ బీ- 4, అప్రెంటీస్ (మైనింగ్ మేట్)- 53, అప్రెంటీస్ (ల్యాబరేటరీ అసిస్టెంట్)- 6
ప్రకటన తేదీ: 2020-05-18
ఆఖరి తేదీ:2020-06-22
ఉద్యోగ రకం:ఫుల్ టైం
ఉద్యోగ రంగం: పబ్లిక్ సెక్టార్
వేతనం:నెలకు రూ.29988
అర్హతలు: పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, మెట్రిక్యులేషన్, బీఎస్సీ ఉత్తీర్ణత
సంస్థ వెబ్‌సైట్: www.ucil.gov.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa