శ్రీకృష్ణుడి చిన్న తనం నుండే ఎంతో అల్లరి చేస్తుండేవాడు. అయన యవ్వనానికి వచ్చాక అయన లీలలు, చిలిపి తనంతో అందరిని ఆకట్టుకునేవాడు. అయితే అయన వివాహానికి సంబంధించి రుక్మిణి, సత్యభామల గురించి ఎక్కువ మందికి తెలుసు. శ్రీకృషుడికి 16 వేలమంది గోపికలు అయన భార్యలుగా చెబుతుంటారు. మరి శ్రీకృష్ణుడు నిజంగా అంతమందిని వివాహం చేసుకున్నాడా? ఒకవేళ నిజంగా అంత మంది గోపికలు ఆయనకి ఉంటె ఎందుకు వారిని వివాహం చేసుకోవలసి వచ్చిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని పురాణాల కథలు ప్రకారం శ్రీకృష్ణుడు 16 వేలమందిని వివాహం చేసుకున్నాడు. అయితే అంతమందిని గోపికలను శ్రీకృష్ణుడు ఎందుకు వివాహం చేసుకున్నాడు అంటే, నరకాసురుడు భూలోకంలోని రాజ కన్యల్ని అపహరిస్తాడు. వారందరినీ పాతాళంలో ఒక గృహంలో బంధిస్తాడు. వారంతా అలాగే ఏళ్ల పాటు నరకాసురుడి చెరలోనే బంధీగా ఉంటారు. మొత్తం 16,0000 మంది రాకుమార్తెలను అతని రాజ్యంలో బందీగా ఉంటారు. వరాహస్వామి దేవేరి-భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు.
నరకాసరుడు అతనికుండే వరగర్వంతో అందరినీ హింసించేవాడు. నరకాసురుడి నుంచి తమను రక్షించమని భూలోకవాసులు, స్వర్గంలోని దేవతలు కోరడంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా అతన్ని వధిస్తాడు. నరకాసురుని సంహరించిన కృష్ణుడు రాజ్యాన్ని అతడి కుమారుడికి అప్పగించి, బంధీలుగా ఉన్న కన్యలను వారి దేశాలకు పంపాలని ఆదేశిస్తాడు. కానీ ఆ కన్యలు మాత్రం వారివారి రాజ్యాలకు వెళ్లడానికి ఇష్టపడరు. శ్రీకృష్ణుడితోనే ఉంటామని పట్టుబడుతారు. అందుకు శ్రీకృష్ణుడు మొదట నిరాకరిస్తాడు. వారి కోరికను కృష్ణుడు నిరాకరిస్తాడు. దీంతో వారంతా ఆత్మత్యాగం చేసుకుంటామని శ్రీకృష్ణుడితో చెబుతారు. తన కోసం అంత పని చేయొద్దంటూ వారిని తనతో ఉండటానికి అనుమతిస్తాడు. దాంతో వారంతా ద్వారక నగరానికి చేరుకుని కృష్ణుడితోనే ఉంటారు. కృష్ణ సహచర్యాన్ని వరంగా పొందిన ఆ 16వేల మంది గోపికలు శ్రీకృష్ణుడిని తమ భర్తగా భావిస్తారు. శ్రీకృష్ణుడ్ని అందరూ శృంగార రూపంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగేశ్వరుడు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేందుకే ఆయన శిఖలో నెమలి ఫించం ధరించాడు.
ఆడా మగా కలిసి సంభోగం చేయని ప్రాణి నెమలి ఒక్కటే. మగ నెమలి బాగా పరవశించినప్పుడు వచ్చే కంటినీటిని తాగి ఆడ నెమలి గుడ్డు పెడుతుంది. ఈ పవిత్ర పక్షి నెమలి ఈకలు తలపై ధరించడానికి కారణం శ్రీకృష్ణుడు తన పవిత్రను లోకానికి చాటిచెప్పడం కోసమేనట. పదహారు వేల మంది గోపికలు ఆయన చుట్టూ ఉన్నా కూడా కృష్ణుడు మాత్రం వారితో అసభ్యంగా ప్రవర్తించలేదు. అందుకే ఆయన అత్యంత పవిత్రుడు. కృష్ణుడు దేహత్యాగం చేసిన ప్రభాస తీర్థం సమీపంలోని కొలనులో ఈ గోపికలంతా దేహత్యాగం చేశారు. ఈ కారణంగానే ఈ కొలనును గోపీతాలాబ్ అంటారు. ఈ కొలను దగ్గర కూర్చుంటే ఆనాటి ఘట్టం కళ్లముందు కదలాడుతుందంట. గోపికలు లేకున్నా.. కృష్ణుడితో వాళ్లు గడిపిన మధురమైన క్షణాలు, మధురమైన జ్ఞాపకాలుగా ఆ కొలనులో తెలియాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందని చెబుతుంటారు. అందుకే శ్రీకృష్ణుడు న్యాయం వైపు ఉంటూ అన్యాయాన్ని ఎదురిస్తాడని దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ కోసం మాత్రమే అయన జన్మించిన ఒక రథ సారథి అని అభివర్ణిస్తారు.
నోట్: కొన్ని పురాణ కథలు, చరిత్రల ఆధారంగా ఈ వ్యాసం సంగ్రహించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa