ఆధార్ కార్డు... ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఓ అవసరం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఇచ్చే ఆధార్ కార్డు ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డు తీసుకున్నవాళ్లలో కొందరు పొరపాటున ఎక్కడో పారేసుకుంటారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతుంటారు.ఆధార్ కార్డు పోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డు నెంబర్ తెలియడంతో పాటు ఆధార్‌తో అనుసంధానం చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ ఉంటే 95 శాతం పని పూర్తయినట్టే. ఎవరి అవసరం లేకుండా మీరే నామినల్ ఫీజు చెల్లించి ఆధార్ కార్డు తీసుకోవచ్చు.ఇప్పుడు వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. లేదా ఫోన్ లో mAadhaar ఆప్ ద్వారా ఈ-ఆధార్ కార్డును ప్రింట్ తీసుకోండి. ఆధార్ కార్డును కేవలం రూ.50(జీఎస్‌టీ, స్పీడ్ పోస్ట్ ఛార్జీలు) చెల్లించి పోస్ట్ ద్వారా ఇంటికి రప్పించుకోవచ్చు . రీప్రింటెడ్ ఆధార్ లెటర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్‌లో వస్తుంది.మీరు ఆధార్ రీప్రింట్ చేసేందుకు ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఒకవేళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోతే నాన్-రిజిస్టర్డ్ నెంబర్ ద్వారా కార్డు పొందొచ్చుUIDAIలో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసి ఉంటే ఆధార్ రీప్రింట్ కోసం ఈ స్టెప్స్ ఫాలో కావాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి వెబ్‌సైట్ www.uidai.gov.in లోకి వెళ్లాలి. ఆధార్ సర్వీసెస్‌లో 'Order Aadhaar Reprint (Pilot Basis)' పైన క్లిక్ చేయాలి.మీ కంప్యూటర్ స్క్రీన్‌పై ఓపెన్ అయిన కొత్త ట్యాబ్‌లో 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వీఐడీ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే 'సెండ్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి 'టర్మ్ అండ్ కండీషన్స్' బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వివరాలు తప్పుగా ఉంటే దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించి తప్పులు సరిదిద్దుకోవాలి. ఆధార్ వివరాలు వెరిఫై చేసిన తర్వాత 'మేక్ పేమెంట్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లాంటి వాటి ద్వారా రూ.50 చెల్లించాలి. పేమెంట్ పూర్తైన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. UIDAIలో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే ఆధార్ రీప్రింట్ కోసం ఈ స్టెప్స్ ఫాలో కావాలి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి వెబ్‌సైట్ www.uidai.gov.in లోకి వెళ్లాలి. ఆధార్ సర్వీసెస్‌లో 'Order Aadhaar Reprint (Pilot Basis)' పైన క్లిక్ చేయాలి.మీ కంప్యూటర్ స్క్రీన్‌పై ఓపెన్ అయిన కొత్త ట్యాబ్‌లో 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వీఐడీ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాలేదన్న విషయం తెలపాలి. నాన్-రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి 'టర్మ్ అండ్ కండీషన్స్' బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఇందులో మీ ఆధార్ వివరాలు కనిపించవు. పేమెంట్ చేసిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది.ఆధార్ రీప్రింట్ రిక్వెస్ట్ స్టేటస్‌ని ఇలా ట్రాక్ చేయొచ్చు. ఇందుకోసం resident.uidai.gov.in/check-aadhaar-reprint వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మీ అక్నాలెడ్జ్‌మెంట్‌పై ఉన్న 28 అంకెల సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa