చైనాలోని వుహాన్‌లో యాంగ్జే నదిపై ఉన్న బ్రిడ్జిపై ఓ కుక్క నాలుగు రోజులుగా అలాగే ఉండటాన్ని జు అనే వ్యక్తి చూశాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ అయ్యాయి. ఆ కుక్కపై జాలి పడిన జు.. దాన్ని తనతో తీసుకెళ్దామని ప్రయత్నిస్తే అది తప్పించుకుని పారిపోయింది. కాసేపటి తర్వాత మళ్లీ అక్కడికే వచ్చి కూర్చుంది. మే 30న ఆ కుక్క తన ఓనర్‌ని ఫాలో అవుతూ బ్రిడ్జిపైకి వచ్చినట్లు తెలిసింది. అది రాత్రి వేళ కావడంతో సీసీ ఫుటేజ్‌లో ఏం జరిగిందో స్పష్టంగా తెలియలేదు. కుక్క యజమాని నదిలో దూకినట్లు మాత్రం అర్థమైంది. అంటే అతను సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆ విషయం తెలియక ఆ కుక్క తన యజమాని కోసం ఎదురుచూడటం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa