ఏపీ సీఎం అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటి ముగిసింది. ఈ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం
భోగాపురం ఎయిర్ పోర్టు,రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.
రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులు కేటాయించాలన్న మంత్రివర్గం. నిధుల కోసం పోరాడుతూనే ప్రాజెక్టు పై ముందుకు వెళ్లాలని నిర్ణయం. 5 దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయాలని నిర్ణయం. రామాయపట్నం పోర్టుకు ఆగస్టుకల్లా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం
వైఎస్సార్ చేయూత పథకానికి కేబినేట్ ఆమోదం. ఎస్సీ,ఎస్టీ,బీసీ మహిళలకు ఈ పథకం కింద 4 ఏళ్లలో రూ.50 వేల ఆర్ధిక సాయం. ఆగష్టు 12న ఈ పథకం ప్రారంభం.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల పై కేబినేట్ సబ్ కమిటి నివేదిక. ఫైబర్ నెట్,రంజాన్ తోఫా,చంద్రన్న కానుకల పై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa