కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇప్పటికే విద్యాసంస్థలు ప్రారంభమై సందడి వాతావరణం ఉండేది. కానీ ఈ సారి ఇప్పట్లో పాఠశాలలు మొదలయ్యే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. పదో తరగతి పరీక్షలనే ప్రభుత్వం రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ త్వరలో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనా సిలబస్ పూర్తి చేయడం అసాధ్యం. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 2020-21 విద్యా సంవత్సరంలో సిలబస్‌ను, బోధనా తరగతులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తి నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని నిశాంక్ పిలుపునిచ్చారు. ‘#సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020’ అనే వేదిక నుంచి లేదా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అభిప్రాయాలను తెలియజేయొచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa