కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్న వారికి ఫలితం తేలేందుకు ఒకటి రెండు రోజులు పడుతోంది. ఆ ఫలితాలను ఆన్‌లైన్‌లో సంబంధిత ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు పంపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియతో సమస్యలు తలెత్తుతున్నాయి.ఈ సమస్యను పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని పంపించాలని భావించింది. కరోనా పరీక్షలు చేయించుకున్న వారు ఇచ్చిన మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ ద్వారా పరీక్ష ఫలితాన్ని పంపిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ పంపించే లింక్ ఆధారంగా ఫలితాన్ని చూసుకునే సౌకర్యం కల్పించారు. ఈ ప్రక్రియ ద్వారా వైద్య చికిత్స త్వరగా మొదలుపెట్టేందుకు అవకాశం ఏర్పడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa