కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడడంతో తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే వారిని పాస్ చేసిన విషయం తెలిసిందే. ఇక వారికి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ బుధవారం జీవో జారీచేశారు.ఇంటర్నల్ మార్కుల ప్రకారం ప్రతీ సబ్జెక్టుకు గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇచ్చి, త్వరలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ, ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్) విద్యార్థులంతా పాసైనట్లేనని, వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
జీపీఏ ఎలా ఇస్తారంటే?
ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులందరికీ గ్రేడింగ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యాశాఖ నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను నిర్వహించింది. వాటి ఆధారంగా ఇంటర్నల్ మార్కులను పాఠశాలలు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ మార్కులు ఇప్పుడు విద్యాశాఖ వద్ద ఉన్నాయి.
ఆ మార్కుల ఆధారంగా విద్యార్ధులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా జీపీఏ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యాశాఖ వద్ద ఉన్న 20 శాతం ఇంటర్నల్ మార్కులను వంద శాతానికి లెక్కించాలని, విద్యార్థులకు ఆ 20శాతంలో వచ్చిన మార్కుల ప్రకారం ఐదింతలు వాటికి కేటాయించాలని నిర్ణయించారు. వన్‌టైం మెజర్ కింద ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా దాదాపు పాసైనట్లేనని తెలుస్తోంది.
ప్రైవేటు విద్యార్థుల పరిస్థితి ఏంటి?
పరీక్షకు మొత్తం 5,34,903 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 25 వేల మంది వరకు ప్రైవేటు విద్యార్థులున్నారు. వారికి గ్రేడింగ్ ఇచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి చెప్పా రు. వారు పరీక్ష రాసేందుకు సిద్ధమై ఫీజు చెల్లించినందున వారికీ గ్రేడింగ్ ఇవ్వక తప్పదంటున్నారు. అయితే వారు పాసైన ఇతర సబ్జెక్టులకు ఇప్పటికే గ్రేడ్స్, గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయా విద్యార్థులు గతంలో ఫెయిౖ లెన సబ్జెక్టు కూడా ఇపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాసైనట్లే లెక్క. ఇపుడు వారికి గ్రేడ్, గ్రేడ్ పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే మొత్తంగా జీపీఏ కేటాయించాల్సి వస్తుంది.గతంలో పాసైన సబ్జెక్టును వదిలేసి, ఫెయిలైన సబ్జెక్టుల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్‌ను కేటాయించాలా? అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి జీపీఏ ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి అన్నారు. విద్యార్థి ఫెయిలైన సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్నర్ మార్కుల ప్రకారమే గ్రేడ్, గ్రేడ్ పాయింట్ ఇచ్చి జీపీఏ నిర్ణయించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa