భారత్ లో లాక్ డౌన్ సడలింపుల తర్వాత రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇక నుంచి ఎవరికైనా కరోనా సోకితే ఆస్పత్రికి తీసుకెళ్లరు. వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తారు. రోజూ డాక్టర్లు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు ఆరా తీస్తారు. ఏ మందులు వాడాలో చెబుతారు. డాక్టర్లే ఇంటికి వచ్చి చూస్తారు. ఇలా 17 రోజుల పాటు చికిత్స అందిస్తారు. పరిస్థితి విషమిస్తే,వైరస్ ప్రభావం పెరిగితే టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేయాలి. అప్పుడు ఆస్పత్రికి తరలిస్తారు.
వైరస్ సోకిన వ్యక్తులకు ఇంట్లో ప్రత్యేక గది ఇవ్వాలి. పిల్లలు,ముసలి వాళ్లను వారికి దూరంగా ఉంచాలి. అవసరమైతే ఆ ఇంట్లో వారు ఉండకుండా చూడాలి. కరోనా పేషంట్ కు ఇంట్లో గాలి తగిలేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
ఇంట్లో ఉన్న వారంతా ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. చికెన్,వేరుశనగ,అల్లం వంటివి తీసుకోవాలి.
అత్యవసరమైతే 18005994455 టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేయాలి.
ఇంట్లో ఆరోగ్యంగా ఉన్న వారు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా పేషంట్లకు సేవ చేయవచ్చు. కరోనా పేషంట్లకు సేవ చేసేవారు డాక్టర్ల సలహాతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు వాడొచ్చు. వాటి కోసం స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి.
కరోనా పేషంట్ కు ప్రత్యేక బాత్రూం ఇవ్వాలి.
ఎవరికి కరోనా ఉన్నా, ఎవరిలో లక్షణాలు కనిపించినా ఏమాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు.
కరోనా సోకిన వారు పండ్లు, క్యారెట్, బీట్ రూట్, నిమ్మ, బత్తాయి, క్యాప్సికమ్ వాడాలి. పసుపు, అల్లం, వెల్లుల్లిని కూరల్లో చేర్చాలి. మైదా, వేపుళ్లు, జంక్‌ఫుడ్, కూల్ డ్రింక్స్, పామాయిల్, బటర్‌లకు దూరంగా ఉండాలి.
కరోనా సోకిన వారు బ్రౌన్ రైస్, గోధుమలు, చిరు ధాన్యాలు, బీన్స్, చిక్కుడు, ఓట్స్ వంటి ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
అందరూ ఆరోగ్య సేతు యాప్ వాడాలి.
కరోనా పేషెంట్ తన గది నుంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
కరోనా పేషెంట్ దగ్గినా, తుమ్మినా రుమాలు లేదా టిష్యూలను అడ్డుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని డస్ట్‌బిన్‌లో వెయ్యాలి. రోజుకు 2 లీటర్ల గోరు వెచ్చని నీళ్లు తాగాలి.
కరోనా సోకిన వారు ఏ వస్తువును ముట్టుకున్నా వెంటన్నే దాన్ని శాానిటైజ్ చెయ్యాలి.
వైరస్ సోకిన వారు తమ గదిని తామే శుభ్రపర్చుకోవాలి. వేడి నీటిలో డెటాల్ వేసి తమ బట్టల్ని అరగంట నానబెట్టి స్వయంగా ఉత్తుకొని ఆరేసుకోవాలి.
ముఖం, పెదవులు బ్లూ కలర్‌లోకి మారినా, జ్వరం బాగా ఎక్కువైనా, గుండెలో నొప్పి వచ్చినా, ఊపిరి ఆడకపోయినా డాక్టర్లకు కాల్ చెయ్యాలి. ఆందోళన పడొద్దు.
వైరస్ ప్రభావం ఎక్కువైతే వెంటనే డాక్టర్ కు చెప్పాలి.
కరోనా పేషెంట్ దగ్గరకు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే వాళ్లు ముక్కుకు మూడు పొరలున్న మాస్క్ (N-95 లాంటిది) వాడాలి. బయటికి వచ్చిన వెంటనే ఆ మాస్కును కాల్చివేయాలి. చేతుల్ని కడుక్కొని శానిటైజర్ రాసుకోవాలి.
పేషెంట్ కోసం వండిన ఆహారాన్ని ఆ వ్యక్తి ఉన్న గదికే పంపాలి. బాడీ ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్ హీట్ కంటే పెరిగితే డాక్టర్లకు కాల్ చెయ్యాలి. రోగి వాడే పాత్రలు, వస్తువుల్ని వేడి నీటిలో 30 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగాలి. అప్పుడు వాడుకోవచ్చు.
వైరస్ సోకిన వ్యక్తి ఇంటి పక్కనే ఉన్నా చుట్టుపక్కల వాళ్లు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎవరికి వాళ్లు కరోనా తమకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వాళ్లు బయట తిరిగితే వారి చేతులపై ఉండే ముద్ర ఆధారంగా వాళ్లను గుర్తించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి.
ప్రస్తుతం ఈ నియమాలన్ని అమెరికా,ఇంగ్లడ్ దేశాల్లో అమలు పరుస్తున్నారు. కానీ భారత్ లో ఇండ్లన్ని చిన్నగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ. ఇవన్నీ పాటించడం కష్టమైన పని అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇండ్లలో ఒకే బాత్రూం ఉంటుందని దాంతో కరోనా పేషంట్ కు ప్రత్యేక బాత్రూం ఎలా కేటాయిస్తామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా, కరోనా సోకినా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించాలని వారు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa