నోకియా కొత్త స్మార్ట్ ఫోన్ ను రూపొందిస్తోంది. నోకియా 2 వీ టెల్లా పేరిట ఈ ఫోన్ రూపొందుతోంది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం. 2 జీబీ ర్యామ్ ను ఇందులో అందించనున్నారు. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. నోకియా 2 వీ టెల్లా స్మార్ట్ ఫోన్ గతేడాది అమెరికాలో లాంచ్ అయిన నోకియా 2 వీ స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా లాంచ్ కానుంది. నోకియా 2 వీ టెల్లా లీకైన స్పెసిఫికేషన్లను చూస్తే ఈ ఫోన్ ధర రూ.7 వేల లోపే ఉండే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa