వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (TAFE) చిన్న రైతులకు ఉచిత ట్రాక్టర్ సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు గడిచిన రెండు నెలల్లో లక్ష ఎకరాలకు పైగా భూమిని సాగు చేసేందుకు సహాయం అందిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడులలో ఈ సేవకు చాలా డిమాండ్ ఉందని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ ను 30 జూన్ 2020 వరకు అందుబాటులో ఉంచింది. ఈ సేవను సద్వినియోగం చేసుకొని ఇప్పటికే చిన్న రైతులు లక్ష ఎకరాలకు పైగా సాగు చేశారని కంపెనీ పేర్కొంది. చిన్న రైతులు జెఫార్మ్ సర్వీసెస్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ వ్యవసాయ కమిషనర్ శ్రీ ఓం ప్రకాష్ (ఐఎఎస్) మాట్లాడుతూ, రాజస్థాన్ రైతులకు ఉచిత అద్దె ప్రాతిపదికన మాస్సీ ఫెర్గూసన్, ఐషర్ ట్రాక్టర్లను అందించేందుకు టాఫ్స్ చేసిన ప్రయత్నం రైతులను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa