జిల్లాలోని రిజిస్ట్రేషన్‌శాఖలో అవినీతికి అంతులేకుండా పోతోంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. వీటిలో నిషేధిత భూములు కూడా ఉంటున్నాయి. ఇలాంటి నిషేధిత భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ ద్వారా సబ్‌రిజిస్ట్రార్లకు బాగా ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. నిషేధిత భూముల జాబితా స్పష్టంగా ఉన్నప్పటికీ అక్రమ సంపాదన కోసం వాటిని రిజిస్టర్ చేస్తున్నారు. ఈ తతంగంలో కొందరు బ్రోకర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు కల్లూరు రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు దే హవా జరుగుతున్నట్లు విమర్శలు అధికంగా ఉన్నాయి. ఏ పనైనా డాక్యుమెంట్ రైటర్ లకు చెప్తే చాలు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి దేవాలయ భూములు పక్కన ఉండే సర్వే నంబరు డాక్యుమెంట్లో కనపరచి రిజిస్ట్రేషన్ లు ఎన్నో జరిగాయి ప్రతిరోజు లక్షలు అవినీతి జరుగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఎంతోమంది రిజిస్టర్ అధికారుల దగ్గరకు వెళితే డాక్యుమెంట్ రైటర్లు దగ్గరికి వెళ్ళండి వారు చెప్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని సంబంధిత అధికారులు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. గతంలో డాక్యుమెంట్ రైటర్ దగ్గర అవినీతి సొమ్ము ఉన్నందున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ల పై కేసులు పెట్టిన ఘనత కూడా ఉన్నాయి అయిన డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్ అధికారులకు లంచాలు ముట్ట చెప్పినట్లు విమర్శలు అధికంగా ఉన్నాయి
ప్రతిపనికీ ఓరేటు
కర్నూలు కల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ లో అవినీతి మయంలో కొట్టుమిట్టాడుతున్న ట్లు విమర్శలు అధికంగా ఉన్నాయి. ప్రతి పనికీ ఓ రేటు ఉంటోంది. ఆ మొత్తంతో చేయితడిపితేనే టేబుల్‌పై ఫైలు కదులుతుంది. లేదంటే ఏదో ఒక కొర్రీ పెట్టి ఫైలును ఆపేయడం షరా మామూలే. రిజిస్ట్రేషన్ కావాలన్నా ప్రభుత్వానికి చెల్లించే ఫీజుకు సమానంగా మామూళ్లు సమర్పిస్తేనే పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కొందరు డాక్యుమెంట్ రైటర్లు దళారుల అవతారమెత్తి అధికారులు, సిబ్బందితో కలసి దందా సాగిస్తున్నారు. అదనపు సంపాదన కోసం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దళారుల దోపిడీ
భూములు, స్థలాల కొనుగోళ్లు, గిఫ్ట్ డీడ్, వీలునామా... ఇలా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే కార్యకలాపాలకు ప్రభుత్వం నిర్దిష్ట ఫీజులను నిర్ణయించింది. సుమారు లక్ష రుపాయల విలువైన ఆస్తులు కొనాలంటే ప్రభుత్వానికి రూ.7500 చెల్లించాలి. దీనికి అదనంగా రూ.100 నుంచి రూ.200 వరకు యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దళారులు రూ.లక్షల్లో ప్రజల నుంచి గుంజేస్తున్నారు. వివిధ కారణాలు చూపించి, వాటన్నింటినీ తామే చేయిస్తామంటూ భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. ఇందులో అధికారులకు కూడా వాటా అందుతోందనేది బహిరంగ రహస్యం ఏమైనా కల్లూరు కర్నూల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అని ప్రజలు కోరుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa