ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెల్లో పరిశుభ్రత సాధ్యమనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనం మన పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చిందని డివిజనల్ పంచాయతీ అధికారి నూర్జహాన్, ఎంపిడిఓ గీతవాణి తెలిపారు. సోమవారం మండలం పరిధిలో ఆరేకల్ గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా గ్రామ పెద్దలు, గ్రామ వాలంటరీ చూడాలన్నారు. ఈ నేపథ్యంలో చెత్తసంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఈఓపిఆర్డి నాగరాజ్, ఏపీఓ చంద్రశేఖర్, ఐకెపి ఎపిఎం జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa