ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాటమరాయుడికి బాహుబలికి నాలుగు వారాల గ్యాప్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 01:59 AM

కాటమరాయుడు షూటింగ్‌ పార్‌‌ట ఇంకా చాలానే బ్యాలెన్‌‌స వుందట. ఇంతవరకు ఒక్క పాట మినహా మరేదీ చిత్రీకరించలేదట. అయితే మార్చి 24న విడుదల చేయడానికి నిర్మాత ఫిక్‌‌స అయిపోయారు. అదే రోజున విడుదల చేయమని పవన్‌ కళ్యాణ్‌ కూడా చెప్పాడట. 


కానీ మరో ఇరవై రోజుల్లోగా బ్యాలెన్‌‌స వర్‌‌క పూర్తయితే తప్ప ఆ డేట్‌కి సినిమా రాదు. అవసరమైతే సీన్లు తగ్గించి, ఒక పాట తొలగించి అనుకున్న టైమ్‌కి విడుదల చేయాలని డిసైడయ్యారట. ఆలస్యం జరిగితే జరిగింది అనుకోకుండా అంత హడావిడిగా సినిమా విడుదల చేయాల్సిన అవసరమేంటి? లేట్‌ అయితే బాహుబలితో క్లాష్‌ వుంటుందని కాటమరాయుడు యూనిట్‌ భయపడుతోందట. ఏప్రిల్‌ 28న బాహుబలి రిలీజ్‌ వుండడంతో దానికి కనీసం నాలుగు వారాల గ్యాప్‌ వుండాలని ఈ డేట్‌కి వస్తున్నారట. 


బాహుబలి రిలీజ్‌ డేట్‌ కూడా పక్కా అని చెబుతున్నారు కనుక ఛాన్‌‌స తీసుకోవడానికి కాటమరాయుడు నిర్మాత ధైర్యం చేయడం లేదు. కాటమరాయుడనే కాదు, సమ్మర్‌కి ప్లాన్‌ చేసిన అన్ని చిత్రాలకీ బాహుబలి 2 తలనొప్పిగా తయారైంది. దీనికి ఎంత గ్యాప్‌ ఇస్తే ఉత్తమమనే దానిపై ఎవరూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఇటు, అటు నాలుగు వారాల గ్యాప్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. బాహుబలి 2 రిజల్‌‌టని బట్టి తర్వాత వచ్చే సినిమాల తేదీలు కాస్త అటు, ఇటు కావచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com