బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. ఏకంగా నాలుగు నెలల పాటు భారత్ ఫైబర్ వినియోగదారులకు, ల్యాండ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కానీ మీరు 36 నెలల దీర్ఘకాలిక ప్లాన్ ను తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ లో ఇతర దీర్ఘకాలిక ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ వాటికి ఈ ఆఫర్ అందుబాటులో లేదు. భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే అన్ లిమిటెడ్ కాలింగ్ లాభాలతో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ మీకు లభిస్తుంది. చాలా ప్లాన్ల ద్వారా మీకు అందించిన ఎఫ్ యూపీ పరిమితి మేరకు అద్భుతమైన స్పీడ్ తో డేటా కనెక్షన్ ఎంజాయ్ చేయవచ్చు. అయితే బీఎస్ఎన్ఎల్ వివిధ టెలికాం సర్కిళ్ల పరిధిలో వేర్వేరు ప్లాన్లను అందిస్తోంది. ఆయా ప్లాన్లకు వేర్వేరు లాభాలు ఉండేవి. ఇంతకుముందు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ లాభాలు కూడా లభించేవి. ఇప్పుడు ఆ ఆఫర్ ను బీఎస్ఎన్ఎల్ తొలగించింది. గూగుల్ హోం మినీ, నెస్ట్ మినీ వంటి లాభాలను ఈ వార్షిక ప్లాన్ల ద్వారా పొందవచ్చు.