కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి వివిధ రకాల ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలని, కరెన్సీ నోట్లని, దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. అవన్నీ పుకార్లేనని తేలింది. తాజాగా ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీనిపై వైద్యనిపుణులు సందేహాలను నివృత్తి చేసారు. ఆహార పదార్థాల ద్వారా వైరస్ వ్యాప్తి కేవలం పుకారేనని, ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మవద్దని కోరారు.