ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతన్నలకు వెలుగు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 01:50 AM

 -దుఃఖం పోవాలె తలరాత మారాలె  


-శాశ్వత విధానాలు రూపొందిస్తాం  


-సిరిసిల్లలో అపెరల్‌ పార్కు  


-పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం


 -నేత మగ్గాలకు సబ్సిడీపై నూలు 


 -పవర్‌లూమ్‌కు సబ్సిడీపై రసాయనాలు, నూలు సరఫరా


 -నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు


-తెలంగాణ రాష్ట్రంలోని నేత కార్మికుల జీవితాల్లో 


వెలుగు నింపుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. నేతన్నల కుటుంబాల్లో శాశ్వతంగా దుఃకం పోవాలని, వారి తలరాత మారాలని సీఎం ఆకాంక్షించారు. చేనేత మగ్గాలు, మర మగ్గాలలో పనిచేస్తున్న కార్మికులందరూ మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానాన్ని రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు.


హైదరాబాద్‌, సూర్య ప్రధాన… ప్రతినిధి : ఆకలి చావులు, ఆత్మహ త్యలు చేసుకునే దుస్థితి నుంచి నేతకార్మికులు బయటపడాలని, సంతోషకరమైన జీవితం గడపాలని చెప్పారు. సిరిసిల్ల, పోచంప ల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్రానే అపప్ర దకు బదులుగా, తెలంగాణలో నేత కార్మికులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారనే మాట వినిపించాలని సీఎం కోరారు. నేత కార్మికుల సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవా ల్సిన చర్యలపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీ రామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహా దారు జి.వినోద్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శేఖర్‌ప్రసాద్‌ సింగ్‌,  ముఖ్యకార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయే శ్‌రంజన్‌, కో అపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ రవీందర్‌, సిరిసిల్ల కలె క్టర్‌ కృష్ణభాస్కర్‌, సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్‌లూమ్‌ పరిశ్రమకు చెందిన 40మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నేత పరిశ్రమకు చెందిన ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాలను సీఎం సావధా నంగా విన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  నేత కార్మి కుల సంక్షేమం, అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇందుకోసం రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు గతంలో ఎంతో గొప్ప పేరుండేదని సీఎం అన్నారు. అలాంటి నేత కార్మికుల బతుకులువ్యధాభరితంగా, బాధామయంగా మారడం దురదృష్ణకరమన్నారు.  ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట్‌ ప్రాంతంలో నేసే పట్టు, ఇక్కత్‌చీరలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. గతంలో పెళ్లి బట్టల కోసం కంచికిపోయే వారు పోచంపల్లికల పోవడం మనకు గర్వకా రణమన్నారు. ఇలాంటి కళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉదన్నారు. నేత వృత్తిని ఆధారం చేసుకుని బతికే కార్మికులకు నెలకు రూ.15-20వేల ఆదా యం తప్పక రావడమే ప్రభుత్వ లక్షమని సీఎం చెప్పారు. అందుకోసం పవర్‌ లూములు నడిపే యజమానులకు అవసరమైన చేయూత అందివ్వడానికి సిద్ధ ంగా ఉన్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో ప్రభుతవ ఇంత ఉదారంగా ఎప్పు డు ముందుకురాలేదని, ప్రభుత్వ చేయూత అందితే తాము కార్మికులకు నెలకు రూ.15వేలకు తక్కువ కాకుండా వేతనం బ్యాంకులో వేస్తామని యజమానులు సీఎం సమక్షంలో అంగీకరించారు. పండుగల సందర్భంగా పేదలకు పంచే బట్టలతో పాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని రకాల వసా్తల్రను రాష్ట్రంలోని నేత పరిశ్రమ ద్వారా వచ్చిన వాటినే కొనుగోలు చేస్తామని సీఎం చెప్పారు. 


పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం


నేత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించే పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం అనుసరించనున్నట్లు సీఎం వెల్లడించారు. చేనేత మగ్గాలపై పనిచేస్తున్న వారు, పవర్‌లూమ్‌ కార్ఖానాల్లో కూలీలు, నేత వృత్తిని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకున్నవారు మూడు విధాలుగా పద్మశాలీలున్నారన్నారు. వీరి కోసం త్రిముఖ వ్యూహం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 


వరాల జల్లు


*చేనేత మగ్గాలపై పనిచేస్తూ సాధారణ వసా్తల్రు నేసే వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాడు అందించాలని సీఎం నిర్ణయించారు. నూలు, రసాయనాలకు సబ్సి డీపై అందిస్తామన్నారు. వారు తయారుచేసిన వసా్తల్రన్నింటినీ ప్రభుత్వం తరపు నే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ చేనేత మగ్గాన్ని లెక్కిస్తారు. చేన ేతపై ఆధారపడిన వారిని గుర్తిస్తారు. నారాయణపేట, గద్వాల, పోచంపల్లి ప్రాం తాల్లో కళాత్మక వసా్తల్రు తయారు చేసేవారున్నారు. వారిని ప్రోత్సహిం చేందుకు కూడా అవసరమైన విధానం రూపొందిస్తారు.


*పవర్‌లూమ్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ఎక్కువ సంఖ్యలో సిరిసిల్ల లోనే ఉన్నాయి. పవర్‌లూమ్‌లను ఆధునీకరిస్తాం. రేపియల్‌ మగ్టాల స్థాయికి చేరుకోవాలి. అప్పుడు నాణ్యత, ఉత్పత్తి పరిణామం పెరుగుతుంది. ఒప్పుడున్న మరమగ్గాల ద్వారా ఒక రోజు 40మీటర్ల బట్ట ఉత్పత్తి అయితే, రేపియల్‌ మగ్గా ల ద్వారా 150 మీటర్లకు పైగా బట్ట ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల యజమా నులకు లాభాలొస్తాయి. దీని ఫలితం మరమగ్గాలపై పనిచేసే కార్మికులకు కూడా దక్కాలి. నెలకు రూ.15వేలకుతగ్గకుండా వేతనం అందాలి. పవర్‌లూమ్‌ పరిశ్రమ ప్రొత్సహించడానికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, హాస్టల్‌, హాస్పిటల్‌ దుప్పట్లు, యూనిఫారాలు కొంటాం. నూలు, రసాయనాలపై సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది అని సీఎం వరాలజల్లు ప్రకటించారు. 


వరంగల్‌ టెక్‌‌సటైల్‌ పార్కుతో మహార్ధశ


నేత వృత్తిని నమ్ముకున్న వారు, అదేఉ పనిచేయగలిగిన వారు కుటుంబాలను పోషించుకునేందుకు సూరత్‌, కొల్హాపూర్‌ ప్రాంతాలకు పోయి పనిచేస్తున్నారని సీఎం అన్నారు. వరంగల్‌ లో ఏర్పాటు చేసే టెక్‌‌సటైల్‌ పార్కు వల్ల కార్మికుల జీవి తాల్లో పెద్ద మార్పు వస్తుందని సీఎం వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ నేతృత్వ ంలోని బృందం ఇటీవలే తమిళనాడులోని తిర్పూరు సందర్శించి వచ్చిందని, అదే పద్దతిలో వరంగల్‌ టెక్‌‌సటైల్‌పార్కు ఉంటుందని చెప్పారు. దీంతో నేత కార్మికులకు మహార్ధశ పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.


దుఃఖపడ్డ సంఘటనలు గుర్తు చేసుకున్న కేసీఆర్‌


తెలంగాణ ఉద్యమ సంయంలో చేనేత కార్మికులు దీనావస్థను చూసి అనేకసార్లు దుఃఖపడ్డానని, రెండు సార్లు అయితే కళ్లవెంట నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. `కరీంనగర్‌ ఎంపీగా ఉండి, ఉద్యమంలో తిరుగుతున్న సమయంలో ఓ రోజు పేపర్లో సిరిసిల్లలో ఒకే రోజు 11 మంది చేనేత కార్మికుల మృతి అనే వార్త వచ్చింది. ఆ వార్త చూసి నా మనసు చలించింది. ప్రశాంతంగా ఉండ ేకపోయా..దుఃఖపడ్డాను. తిండికి లేక కార్మికులు మరణించడం చాలా బాధ అని పించింది. సిరిసిల్ల కార్మికులకు ఎంతో గొప్ప పేరుంది. వారిలా చావడమేంటని ఆలోచించాను. ప్రభుత్వం నుంచి సహాయం అందేఉ పరిస్థితి లేదు. అప్పుడు నేనే పూనుకొని టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున రూ.50లక్షలను సిరిసిల్ల కార్మికుల కోసం పంపాను. అక్కడున్న సొసైటీ ఆ డబ్బులను అవసరమున్న వారికిచ్చి ఆదుకున్నది. మరో సందర్భంలో పోచంపల్లిలో కూడా ఏడుగురు కార్మికులు మరణించారనే వార్త చూసిన. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికుల బాధలు చూసి ఏడ్చిన. నేనే స్వయంగా బిక్షాటన చేసిన. నాలుగు లక్షలు జమచేసి పోచంపల్లిలో మరణించిన నేత కార్మికుల కుటుంబాలకు అందజేసిన. అలాంటి బాధ తెలంగాణలో కూడా కొనసాగవద్దనేది నా ఆకాంక్ష. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com