ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరిన్ని ఇళ్లు ఇవ్వండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 01:42 AM

ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ


 -పీఎంఎవై'పై ప్రధానికి సీఎం మరో లేఖ  


 -గృహ నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష


గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద చేపట్టిన ఇళ్లకు సంబంధించి రాష్ట్రానికి చేసిన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ విషయంలో ప్రధానమంత్రికి మరోమారు లేఖ రాయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పీఎంఎవై పథకం కింద జరిపిన కేటాయింపుల్లో రాష్ట్రానికి ఆశించినంత న్యాయం జరపలేదని, ఈ విషయంలో పార్లమెంట్‌ సభ్యుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.


విజయవాడ, మేజర్‌న్యూస్‌ : శనివారం మధ్యాహ్నం తన అధికార నివాసంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గహనిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. రాష్ర్టంలో మొత్తం 12 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అందులో తొలిదశలో 5 లక్షల ఇళ్లు పూర్తిచేయాలని కత నిశ్చ యంతో వున్నట్టు తెలిపారు. గహ నిర్మాణ శాఖను త్వరితగతిన కంప్యూటరీకరించాలని ఆదేశించారు. వివరాలన్నీ కంప్యూటరీ కరించి సీఎం డ్యాష్‌ బోర్డు ద్వారా అనుసంధానం చేయాలన్నారు. మొత్తం గహనిర్మాణాలను జియో ట్యాగింగ్‌ చేసి, బయో మెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తే వాస్తవ వివరాలు తెలుసుకునే వీలు వుంటుందన్నారు. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఎంతమందికి ఇళ్లు నిర్మిస్తున్నామో, ఇంకా ఎంతమందికి ఇళ్లు అవసరమవుతాయో సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇటీవల పూర్తి చేసిన స్మార్‌‌ట పల్‌‌స సర్వే ద్వారా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని కూడా అనుసంధానం చేసుకోవాలని, తక్షణం ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పారు. 2014-15లో ఇందిరా ఆవాస్‌ యోజన పథకం కింద చేపట్టి నిర్మాణంలో వున్న 10 వేల ఇళ్లకు సంబంధించి అవసరం మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఉపయోగించి పూర్తి చేసే అంశాన్ని పరిశీలించాలని సీయం సూచించారు. గత దశాబ్దకాలంలో గహనిర్మాణ రంగంలో భారీ అవకతవకలు జరిగాయని, వాటి నిగ్గు తేల్చేందుకు విజిలెన్‌‌స చేస్తున్న విచారణ ఎంతవరకు వచ్చిందని సీయం ప్రశ్నించారు. రెండు రోజుల్లో విజిలెన్‌‌స అధికారులతో సమీక్ష ఏర్పాటుచేసి గతంలో కేటాయించిన ఇళ్లపై తగిన నిర్ణయం తీసుకుందామన్నారు. 


   గతంలో తమ ప్రభుత్వం గ హ నిర్మాణాన్ని బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పూర్తిచేసేదని, ఇప్పుడు కూడా ఆదర్శవంతంగా ఈ బహత్తర కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సంకల్పించిందని చెప్పారు. బీబీఎల్‌, బీఎల్‌ స్థాయిలో వున్న 30,884 ఇళ్లకు రూ.200 కోట్లు విడుదల చేయాలని అధికారులు కోరారు. ఈ ఇళ్ల నిర్మాణం 6 నెలల్లో పూర్తవుతుందని వివరించారు. మొత్తం 2,55,137 ఇళ్ల నిర్మాణానికి గాను ఇప్పటికి రూ.309 కోట్లు ఖర్చు పెట్టామని, మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే మొత్తం రూ.932 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ అప్‌గ్రేడేషన్‌ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.10 వేలు ఇస్తున్నామని, అలాకాకుండా కాలనీ మొత్తం ముందుకొస్తే తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తే ఆ కాలనీలు సుందరంగా మారతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తగిన కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. పట్టణ ప్రాంతాలకు కూడా ఎన్టీఆర్‌ అప్‌గ్రేడేషన్‌ పథకాన్ని విస్తరించే అంశాన్ని పరిశీలించాలని గహనిర్మాణ శాఖ మంత్రి శ్రీమతి మణాళిని కోరగా, తగిన చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి నిర్వహించబోయే ప్రతి సమీక్షలో అప్పటికి నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను రిమోట్‌ పద్దతిలో ప్రారంభించి సమావేశం మొదలు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. 


ఈ సమావేశంలో మంత్రి శ్రీమతి కిమిడి మణాళిని, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వర్ల రామయ్య, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లామ్‌, గహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌, హౌసింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమణ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ర్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ యల్‌ వి యస్‌ ఆర్‌ కే ప్రసాద్‌ మధ్యంతర డివిడెంట్‌ రూ.6 కోట్ల చెక్కును అందజేశారు. 2014-15, 2016-17 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి ఏడాదికి మూడు కోట్లు. రెండేళ్లకు మొత్తం ఆరు కోట్ల రూపాయల చెక్కును రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావుతో కలిసి ప్రసాద్‌ రాష్ర్ట ప్రభుత్వానికి అందించారు. గిడ్డంగుల సంస్థ ఆద్వర్యంలో జరుగుతున్న  ప్రాజెక్టులు, నూతనంగా చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రికి మంత్రి పుల్లారావు, ఏపీఎస్‌డబ్లూ్యసీ చైర్మన్‌ ప్రసాద్‌ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com