ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..మే 25వ తేదే ఆఖరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 12:05 PM






కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్-సిపిసిబి, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 48 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 5న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి మే 25 చివరి తేదీ. మొత్తం 48 ఖాళీల్లో సైంటిస్ట్ బీ- 13, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్- 2, సీనియర్ టెక్నీషియన్- 6, డేటా ఎంట్రీ ఆపరేటర్- 2, జూనియర్ టెక్నీషియన్- 2, జూనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్- 7, లోయర్ డివిజన్ క్లర్క్- 13, అటెండెంట్- 3 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలకు cpcb.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.









 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa