ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచులోయలో వెలసిన సూర్యదేవాలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 11:48 AM

మంచు లోయలో వెలసిన సూర్యదేవాలయాన్ని సన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ సాక్షాత్తు శివుడే మంచినీటి ఊట బుగ్గలు ఏర్పరచినట్లు పురాణాలూ చెబుతున్నాయి. జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ కు సుమారు 68 కి.మీ. దూరంలో ఉన్న మార్తాండ్ అనే ప్రదేశం ఎన్నో నదులతో, కాలువలతో, మంచి నీటి బుగ్గలతో ఆవరించబడి ఉంది. ఈ ప్రాంతంలోనే సూర్యదేవాలయం ఉంది. అయితే పూర్వము కాశ్మీర్ పరిపాలించిన ప్రముఖ రాజులలో ముక్యుడు లలితాదిత్య క్రీ.శ. 7 – 8 శతాబ్దాల కాలం లో ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యదేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రజలు దీనిని మార్తాండ్ సన్ టెంపుల్ అని పిలుస్తారు. సూర్యవంశానికి చెందిన ఈ రాజు ఈ ఆలయాన్ని అనంత్ నాగ్ అనే చిన్న పట్టణానికి సమీపంలో ఒక పీఠభూమిపైన నిర్మించారు. ఈయన నిర్మించబడిన నిర్మాణాలలో ఉత్తమమైనదిగా 84 స్తంభాలతో ఎంతో అందంగా నిర్మించబడిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పటి వారి నిర్మాణ నైపుణ్యాలు ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఉపయోగించిన చదరపు సున్నపురాయి ఇటుకలు తెలియజేస్తాయి.
సూర్యదేవ ఆలయం పెద్ద పెద్ద స్థంబాల మీద దీర్ఘచతురస్రాకారపు ఆవరణతో నిర్మించబడింది. ఈ ప్రాచీన మార్తాండ తీర్థమే కాశ్యప ముని నివాసం అని కొందరి అభిప్రాయం. మార్తాండ్ లో మంచి నీటి ఊట బుగ్గలు సాక్షాత్తు శివుడే ఏర్పరచినట్లు పురాణాలూ తెలుపుతున్నాయి. మంచు పర్వత నేపథ్యంలో ఈ ఆలయం నుండి కాశ్మీర్ లోయలోని అందాలు విశాల దృశ్యాలు తిలకించవచ్చు. అయితే సర్ ఫ్రాన్సిస్ అనే ఒక బ్రిటీష్ చరిత్ర కారుడు పరిశోధకుడు ఈ ఆలయం గురించి వివరిస్తూ శిధిలావస్థలో ఉన్న ఈ ఆలయం బ్రహ్మాండమైన నిర్మాణంగా ఉండి, శిల్పనైపుణ్యంతోను, వివిధ అలంకారాలతోను ఎంతో అద్భుతంగా ఉందని రాశారు. ఇంతటి బ్రహ్మాండమైన ఈ సూర్యదేవాలయానికి స్థానిక భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు. మహిమగల ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa