ఏపీలో ఆర్టీసీ బస్సులు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభంకానుంది. అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతున్నా బస్సులు నడపనున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. రిజర్వేషన్లు నిన్న రాత్రి ప్రారంభమయ్యాయి. రిజర్వేషన్లు చేసుకున్న వారికే ప్రయాణానికి అనుమతి. విజయవాడ- విశాఖ మధ్య 6 సూపర్ లగ్జరీ, ఒక ఏసీ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.