కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మరి నియంత్రణకు దేశాలన్నీ వివిధ చర్యలు తీసుకుంటున్నా దీని తీవ్రత మాత్రం తగ్గడం లేదు. తాజాగా మెక్సికోలో ఒక విచిత్రం చోటుచేసుకుంది.
మోంటేమోరేలోస్ నగరంలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆ వడగాళ్ల రూపం అచ్చం కరోనా లానే ఉందంటూ అక్కడి ప్రజలు మంచు ముద్దలకు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే కుర్చోవాలని ఆ దేవుడు సందేశం పంపాడని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వాతావరణ అధికారులు దీన్ని కొట్టిపారేసారు. సాధారణ రోజుల్లో కూడా కొన్నిచోట్ల వడగళ్లు ఈ రూపంలోనే పడుతుంటాయని, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు వీటిని చిత్రంగా చూస్తున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa